దేశవ్యాప్తంగా ఉత్తమ పరిశుభ్ర నగరాల్లో మూడో స్ధానంలో విజయవాడ.


అమరావతి (ప్రజా అమరావతి);

  

శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఎం ఎం నాయక్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి సంపత్‌ కుమార్‌లు.


స్వచ్ఛ సర్వేక్షణ్‌  పోటీల్లో భాగంగా కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖ... పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో దేశ వ్యాప్తంగా ఉత్తమ పనితీరు కనపర్చే నగరాలకిచ్చే అవార్డుల్లో ఏపీకి అవార్డుల పంట.


దేశ వ్యాప్తంగా పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమ పనితీరు కనపర్చిన నగరాలు, పట్టణాలకిచ్చే అవార్డుల్లో 11 అవార్డులను ఆంధ్రప్రదేశ్‌ కైవసం చేసుకున్నట్టు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు వివరించిన మంత్రి బొత్స సత్యనారాయణ, పట్టణాభివృద్ధిశాఖ అధికారులు.

  

ఈ నెల 20 వ తేదీ కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన స్వచ్ఛ అమృత్ మహోత్సవ్‌లో వివిధ కేటగిరీల్లో 11 అవార్డులను అందుకున్న ఆంధ్రప్రదేశ్‌. 


దేశవ్యాప్తంగా ఉత్తమ పరిశుభ్ర నగరాల్లో మూడో స్ధానంలో విజయవాడ.


ఈ కేటగిరీలో రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకున్న విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌ , స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌కుమార్‌లు


నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమ పనితీరు కనపర్చడంలో మంచి ప్రగతి సాధించినందుకు పట్టణాభివృద్ధిశాఖను అభినందించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.


ప్రజలకు భవిష్యత్తులో ఇదేవిధంగా మరిన్ని సేవలు అందించి, ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి.


సీఎంను కలిసిన విజయవాడ, తిరుపతి, గ్రేటర్‌ విశాఖపట్నం, పుంగనూరు, పిఠాపురం, నెల్లూరు, వైయస్సార్‌ కడప జిల్లాకు చెందిన కార్పొరేషన్ల కమిషనర్లు, మేయర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఛైర్మన్లు.

Comments