భారీ వర్షాల నేపథ్యంలో సోమశిల జలాశయం సమీపంలోని కుల్లూరు మండలం వెంకట్ రెడ్డి పాలెం పెన్నానదిపై

 


నెల్లూరు, నవంబర్ 19 (ప్రజా అమరావతి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమశిల జలాశయం సమీపంలోని కుల్లూరు మండలం వెంకట్ రెడ్డి పాలెం పెన్నానదిపై


నిర్మించిన జాతీయ రహదారి బ్రిడ్జి పైనుంచి సోమశిల జలాశయం నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర బాబు, జిల్లా ప్రత్యేకాధికారి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రాజశేఖర్ తో కలిసి పరిశీలించారు. శుక్రవారం వారు సోమశిల జలాశయానికి బయలుదేరగా కుల్లూరు సమీపంలోని వెంకట్ రెడ్డి పాలెం రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీగా వరద నీరు ప్రవహించడంతో అక్కడ తమ వాహనాలను నిలుపుదల చేశారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జెసిబి సాయంతో వారు రహదారిని దాటి కొంత దూరం నడిచి వెళ్లారు. తదుపరి జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జి పై నిలబడి సోమశిల జలాశయం నుంచి దిగువకు విడుదల చేసిన నీటిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.  కలెక్టర్ వెంట తెలుగుగంగ   ప్రాజెక్ట్  డిఈ శ్రీనివాసులు రెడ్డి  ఉన్నారు.