కర్నూలు (ప్రజా అమరావతి);
ఇళ్లను కూలగొట్టి పునర్వసము కల్పించలేదు అని రోడ్ పై నిరసన చేసిన నీలి షికార్లు .
కర్నూలు బంగారుపేట కు చెందిన గిరిజన నిలి శికరుల ఇళ్లను నిన్న ఉదయం తొలగించరు.
దానికి ప్రత్నమ్యయంగ ఇంకో చోట వారికి ఇళ్లను కేటాయించి ముందస్తు సమాచారంతో కాలి చేయించాలి కానీ.
మున్సిపాలిటీ కమిషనర్ ఆదేశాలు అంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయకుండా ఈ దారుణమైన సంఘటన కు పాల్పడ్డారు.
నిన్న రాత్రి నుంచి ఈ రోజు వరకు కుడు గుడు లేక పిల్లలు పెద్దలు అందరూ కలెక్టర్ అఫీస్ ముందు బీఎస్పీ నాయకుడు పి.బి రాజ్ కుమార్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
సుమారు రెండు గంటల సమయం తరువాత డి. పుల్లయ్య [DRO] గారు ప్రత్యేకంగా బాధితులను పరామర్శించి వారికి గతంలో ఇచ్చిన ఇల్లు అక్రమాలకు గురైనటువంటి వాటిని కాలి చేయించి అందరికీ ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు..
బీఎస్పీ నాయకుడు పి.బి రాజ్ కుమార్ అంబేడ్కర్ మాట్లాడుతూ గిరిజన అమాయక ప్రజలను ఇలా ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదు విళ్ళ తరుపున బహుజన సమాజ్ పార్టీ వుంటుంది వారికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని అన్నారు.
ఇళ్లను కోల్పోయి దారుణ అవస్థలు పడుతున్నా బాధితులు మాట్లాడుతూ మేము పని చేసుకొని బ్రతికే బీద వాళ్ళం మేము కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చి మాకు ఎక్కడ వేళ్లలో తెలియని పరిస్థితుల్లో వుంచారు ఇంత జాలి దయ లేని ప్రభుత్వం మరియు అధికారులు ఒక్కసారి ఆలోచించండి మా పసి పిల్లల ఉసురు తగులుతుంది అంటూ మా శాపనార్థాలు ఇవే అంటూ రోదించారు.
addComments
Post a Comment