• భారీ వర్షాల వలన ఇబ్బందులు పడుతున్నచిత్తూరు జిల్లా ప్రజానీకానికి ప్రభుత్వ పరంగా అందిస్తున్న సహాయ సహకారాలు..
చిత్తూరు (ప్రజా అమరావతి); జిల్లాలో నవంబరు 17వ తే ది నుండి భారీ వర్షాలు పడే సూచనలున్నందున, జిల్లా కలెక్టర్ఎం.హరినారాయయణన్ జిల్లా యంత్రాగాన్ని ముందుగానే అప్రమత్తం చేశారు. చిత్తూరు జిల్లాకేంద్రంలో, తిరుపతి, మదనపల్లె డివిజన్ కేంద్రాలలో రౌండ్ ది క్లాక్ పనిచేసేందుకు కంట్రొల్ రూములు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో జాయింట్ కలెక్టర్ రెవిన్యూ ఆధ్వర్యంలో, తిరుపతి లో ఆర్డీవో మదనపల్లె లో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూములు పని చేస్తున్నాయి. కంట్రోల్ రూము కు వచ్చిన కాల్స్ కువెంటనే స్పందించి జిల్లా యంత్రంగం బాధితులను ఆదు కుంటున్నారు.
గౌ. ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలలో చిక్కుకున్న ప్రజానీకానికి తక్షణ సహాయక చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టింది.
• జిల్లా లో ఇప్పటివరకు 83 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 9301 మందికి భోజనం, వసతి కల్పించారు.
వర్షాలు తుగ్గు ముఖం పడుతున్న దృష్ట్యా పునరావాస కేంద్రాలలో ప్రజలు ఇళ్లకు వెడుతున్నారు. ఆదివారం నాటికి జిల్లాలో 29 పునరావాస కేంద్రాలలో 4210 మంది వసతి పొందుతున్నారు. ఇంకనూ కావాల్సివుంటే పునరావాస కేంద్రాలను అందుబాటులో ఉంచారు.
ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు 17 వ తేదీ నుండి పునరావాస కేంద్రాలకు చేరుకున్న వారికి ఒక్కొక్కరికి రూ. 1000/- చొప్పున ఒక కుటుంబానికి గరిష్టంగా రూ. 2000/- లు వంతున పైకం అందజేస్తున్నారు.
ఈ పైకంతో వారు ఇంటిని శుభ్రం చేసుకోవడానికి వీలుంటుంది.. సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీపడకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.భారీ వర్షాల వలన ఇబ్బందులు పడుతున్న జిల్లాలకు ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేక అధికారులను నియమించగా చిత్తూరు జిల్లాలో వరద పరిస్థితులను సమీక్షించేందుకు ప్రద్యుమ్న ఐఏఎస్ ను జిల్లాకు కేటాయించారు.వారు జిల్లా కు చేరుకుని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నగరపాలక సంస్థలు, అన్ని మున్సిపాలిటీ, గ్రామాలలో ఎక్కువ సిబ్బందిని పెట్టి పారిశుద్యాన్ని మెరుగుపరచాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు.. భారీ వర్షాల వలన జరిగిన నష్టాలను శాఖాధికారులు అంచనా వేసి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో జరిగిన నష్టాలను అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మండల, మున్సిపల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించారు. ప్రజలకు అందుబాటులో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది వుంటూ ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు తక్షణ సేవలు అందించారు.
వర్షం వలన జిల్లా కలెక్టర్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై, లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను పునరావాసా కేంద్రాలకు తరలించారు. వరద నీటితో నిండిన గ్రామాలను అధికారులు సందర్శించి ఇళ్ళల్లో నీరు ప్రవేశించిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాస కేంద్రాలలో మంచి భోజనం, త్రాగునీరు అందిస్తున్నారు. దీని తో పాటు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలకు కావలసిన వైద్య సేవలను అందిస్తున్నారు.. పారిశుద్యానికి అధిక ప్రాధాన్యం యిస్తూ గ్రామాలలో ఎప్పటికప్పుడు పారిశుద్యాన్ని మెరుగుపరుస్తున్నారు.. వర్షాల వలన వ్యాధులు ప్రబలకుండా పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో నలుగురు మరణించారు.,మరో నలుగురు గల్లంతు కాగా వారి ఆచూకి ఇంకనూ తెలియవలసి ఉన్నది.
ముంపుకు గురి అవుతున్న చెరువులను గుర్తించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లా కలెక్టర్ ,జాయింట్ కలెక్టర్ లు, తిరుపతి నగరపాలక కమిషనర్, సబ్ కలెక్టర్, ఆర్ డి ఓ లు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు, స్పెషల్ ఆఫీసర్ లు వారి పరిధిలో పర్యటించి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. జిల్లాకు నియమించిన స్పెషల్ ఆఫీసర్ ప్రద్యుమ్న జిల్లాలో పలు ప్రాంతాలు పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకు ని వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు సహాయక చర్యలను చేపడుతుందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా సమస్యలు ఉంటే స్థానిక అధికారుల దృష్టికి తీసుకుని రావాలని ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందనే భరోసా కల్పిస్తున్నారు.
addComments
Post a Comment