కామన్ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ (కాస్) పై అవగాహన కార్యక్రమం... సిడిపిఓ.. ఎమ్.మమ్మి.

 


కొవ్వూరు  (ప్రజా అమరావతి);


కామన్ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ (కాస్) పై అవగాహన కార్యక్రమం... సిడిపిఓ.. ఎమ్.మమ్మి.


సమగ్ర అభివృద్ధి సేవా పథకం’ ఈ పథకము గర్భవతులు, బాలింతలు మరియు పిల్లల ఆరోగ్యం, పోషణ మరియు 6సం. లోపు పిల్లల అభివృద్ధి కొరకు నిర్దేశించబడినదని కొవ్వూరు సిడిపిఓ ఎమ్.మమ్మి పేర్కొన్నారు. డేటా సేకరణ, నమోదు విషయంలో వాస్తవాలు నమోదు చెయ్యాల్సి ఉంటుందన్నారు. 


స్థానిక ఐ సి డి ఎస్ కేంద్రంలో సమగ్ర అభివృద్ధి సేవా పథకం’పై శిక్షణ మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మమ్మి మాట్లాడుతూ,  ఐసిడియస్ వ్యవస్థను బలోపేతం చేసి పిల్లలు, గర్భవతులు, బాలింతల పోషణస్తితిని మెరుగు పరచుట కొరకు పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ వారి సూచనలతో రూపొందించిన యాప్ లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గర్భవతుల, బాలింతల, పిల్లలు వివరాలు నమోదు చేయాలన్నారు. ఐ.సి.డి. యస్ బలోపేతము,  సమాచార ప్రచార సాంకేతికత ఫై కార్యకర్తల సామర్ద్యము పెంచుటకు ఈ శిక్షణ తరగతులు ఉపయోగించుకోవాలని మమ్మి పేర్కొన్నారు. కామన్ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ (కాస్) స్మార్ట్ ఫోన్ లను అంగన్వాడి కార్యకర్తలకు అందించి వారిచే విషయ సేకరణ చేయుట ముఖ్య ఉద్దేశ్యం గా తెలిపారు. మండల, డివిజన్, జిల్లా స్థాయి వరకు ప్రతి అంచెలో మనం నమోదు చేసే వాటిపై పర్యవేక్షణ ఉంటుందని, ఏ ఒక్క అనుకోని సంఘటనలు జరిగినా అందుకు సంబంధించిన సిబ్బంది నుంచి అధికారుల వరకు బాధ్యులను చేస్తున్నారని మమ్మి స్పష్టం చేశారు. 


ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గర్భవతుల, బాలింతల, పిల్లలు వివరాలు బరువు, హీమోగ్లోబిన్ శాతం, ఎత్తు, వంటి ప్రతి ఒక్క వివరాలు ఎవరు అడిగినా చెప్పేలా ఉండాలన్నారు. ఈ డేటా సేకరణ కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించారని ఆమె తెలిపారు.


5 సం లోపు పిల్లలలో మోడరేట్ ,  తీవ్ర లోపపోషణ గల పిల్లలను ఎత్తుకు తగిన బరువు లేని వారిని వయస్సుకు తగ్గ ఎత్తు లేని వారిని గుర్తించి వారికీ 6 నెలల పాటు ప్రత్యేక పర్యవేక్షణ తో కూడిన అదనపు ఆహరం  అందించాలనే లక్ష్యం తో డేటా ను అప్ లోడ్ చెయ్యాల్సి ఉంటుందన్నారు. 7 నెల నుండి ౩ సం. పిల్లల కోసం  విటమిన్లు, మినరల్స్ తో బలోపేతం చేయబడిన 2.5 కేజీల ప్యాకేట్ బాలమృతం పొడిని, నెలకు 8 కోడి గ్రుడ్డ్లు అందిస్తున్న మన్నారు.


బాల సదనాలు ద్వారా  అనాధ,  పాక్షిక అనాధ ,  దారిద్య రేఖకు దిగువన గల కుటుంబాలలోని 6సం. – 11 సం బాలికలకు ఉచిత ఆవాసం మరియు విద్య అందించుట కొరకు ఏర్పాటు చేయబడినది. 6 వ తరగతి నుండి బాల సదనం నందలి బాలికలను సెకండరీవిద్య కొరకు కస్తూరిబా విద్యాలయాలలో  భోధన కోసం చర్యలు చేపట్టామన్నారు.


ఈ అవగాహన, శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.