మంత్రి కొడాలి నాని సూచనలను పరిగణనలోకి తీసుకొని ఫ్లై ఓవర్ ను ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాం- మంత్రి కొడాలి నాని సూచనలను పరిగణనలోకి తీసుకొని ఫ్లై ఓవర్ ను ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాం


- మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి


 గుడివాడ, నవంబర్ 8 (ప్రజా అమరావతి (: రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా గుడివాడ పట్టణంలో ఫ్లైఓవర్ ను తీర్చిదిద్దుతామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చెప్పారు. సోమవారం గుడివాడ పట్టణంలోని మంత్రి కొడాలి నానితో కలిసి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో నిర్మించే ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి మంత్రి కొడాలి నాని పలు సూచనలు చేశారని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణం ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని, ట్రాఫిక్ కనెక్టివిటీకి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పలు జాగ్రత్తలను సూచించారని చెప్పారు. వీటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మంత్రి కొడాలి నాని సూచనలను పరిగణలోకి తీసుకొని డిజైన్లో మార్పులు చేస్తామని, కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఆమోదం తీసుకుంటామన్నారు. కొంత బడ్జెట్ పెరిగినప్పటికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఫ్లైఓవర్ ను  తీర్చిదిద్దాలని నిర్ణయానికి వచ్చామన్నారు. గతంలో గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించినప్పుడు నాలుగు అంతస్తుల తో ఉన్న భవనానికి లిఫ్ట్ లేక ఇబ్బందులు పడుతున్నామని తన దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. ఈ విషయాన్ని కెనరా బ్యాంక్ సీఈవో దృష్టికి తీసుకు వెళ్దామని, రూ. 25 లక్షల నిధులను మంజూరు చేశారని చెప్పారు. త్వరలోనే లిఫ్ట్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గుడివాడ- కంకిపాడు ప్రధాన రహదారికి 27 కిలోమీటర్ల పొడవునా రెండు వైపులా పంట కాలువలు ఉన్నాయని చెప్పారు. ఈ రోడ్డును నేషనల్ హైవే పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదనలు చేశామన్నారు. వచ్చే ఐదారు నెలల్లో అనుమతులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కూచిపూడి నుండి నిడుమోలు, ముదినేపల్లి వయా కౌతవరం రోడ్లు కూడా నేషనల్ హైవే పరిధిలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇవన్నీ పూర్తయితే గుడివాడ పట్టణానికి రోడ్ల సమస్య దాదాపు పరిష్కారమైనట్టేనని చెప్పారు. గుడివాడ రూరల్, నందివాడ మండలాల్లోని 68 గ్రామాలు, శివారు ప్రాంతాలకు తాగునీటి సమస్యను పరిష్కరించే మల్టీ విలేజ్ స్కీమ్ ఏర్పాటుకు రూ. 270 కోట్ల నాబార్డు నిధులను మంజూరు చేయిస్తానని ఎంపీ బాలశౌరి చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవి నారాయణరెడ్డి, నాయకులు  మట్టా జాన్ విక్టర్, పెయ్యల ఆదాం, కందుల దుర్గా కుమారి, మేకల సత్యనారాయణ, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి, ఎస్కే బాజీ, కంచర్ల జగన్, తోట రాజేష్, గంటా చంద్రశేఖర్, దారం నరసింహ, కందుల నాగరాజు, అంగడాల వేణు, రహమతుల్లా, సయ్యద్ గఫార్, మూడెడ్ల ఉమా, మెండా చంద్రపాల్, అబ్బూరి భాస్కరరావు, గోళ్ళ రామకృష్ణ, మాదాసు వెంకట లక్ష్మి కుమారి, కొర్నిపాటి గణపతి, సత్య దుర్గాప్రసాద్, రేమల్లి పసి, అగస్త్య రాజు కృష్ణమోహన్, అల్లం సూర్యప్రభ, అల్లం రామ్మోహన్, రంగా, వెంపటి సైమన్, మామిళ్ళ ఎలీషా, గుదే లక్ష్మి రంగనాయకమ్మ, గణపతి సూర్జ్యం, బచ్చు మణి కంఠ, కొత్తూరి లక్ష్మీనారాయణ, వీరిశెట్టి వెంకట నరసింహారావు, కనుమూరి రామిరెడ్డి, కొంకితల ఆంజనేయ ప్రసాద్, కొలుసు నరేంద్ర, గుమ్మడి నాగేంద్ర, గుడివాడ ఆర్డిఓ జి శ్రీను కుమార్ తదితరులు పాల్గొన్నారు.