చిత్తూరు నవంబర్ 27 (ప్రజా అమరావతి): వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడం జరుగుతుందని
ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారంతో పాటు నూతనంగా ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి అన్నారు. శనివారం ఉదయం ఉపముఖ్యమంత్రి, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు ,రాష్ట్ర మొదలియర్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ లు నగరంలోని సంతపేట ప్రాంతంలోగల కైలాసపురం లో పర్యటించారు. 19వ తేదీన నీవా నది ఉధృతికి 7 ఇళ్ళు పూర్తిగా కొట్టుకుపోగా 173 మంది ఇల్లల్లో కి నీరు చేరడం జరిగింది. దీనికి సంబంధించి ఏడు మందికి 90 వేల రూపాయల చొప్పున పరిహారం అందించారు. అదేవిధంగా 173 మంది కి 2000 రూపాయల చొప్పున అందించారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి అన్నారు. నీవా నది ఉధృతి ఇంకా తగ్గలేదని అప్రమత్తంగా ఉండాలని, అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందుకే పరిహారం కూడా వారం రోజులు తిరగకుండానే ఇస్తున్నారని ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నట్లుగా తెలిపారు.
1.జి.గీత,కైలాసపురం,ఈ నెల 18వతేదీన భారీ వర్షం కురవడం జరిగిందని, ఎన్నడూ లేని విధంగా అకస్మాత్తుగా నది ఉధృతంగా ప్రవహించడంతో మా ఇళ్లల్లోకి నీరు ప్రవేశించడం జరిగింది. నా భర్త శ్రీనివాసులు అనారోగ్యంతో ఉండటంతో ఆయనను బయటకు తరలించే సమయంలో ఇల్లు మొత్తం కొట్టుకుపోయింది. ఇంటితో పాటు ఉన్న సామాన్లు అన్నీ వరద ఉధృతి లో వెళ్లిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇస్తామని చెప్పడం కొంత ధైర్యాన్ని ఇచ్చింది. ఎప్పుడు ఆలస్యంగా ఇచ్చే పరిహారం వారం తిరక్కుండానే ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. దీంతోపాటు ఉప ముఖ్యమంత్రి ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణాన్ని కూడా మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. ఇల్లు మంజూరు అయిన వెంటనే ఇంటి నిర్మాణం చేసుకుంటాం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
2. గోవిందు, 40వ డివిజన్ : నీవా నది కి ఎన్నడూ లేని విధంగా వరదలు రావడం, ఇంట్లో ఉన్న సామాగ్రిని కొంతవరకైనా దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఇల్లు కోట్టుకుని పోవడం జరిగింది. అప్పటి నుంచి సహాయక శిబిరాల్లో తల దాచుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి సొమ్ము రావాలంటే చాలా సమయం పడుతుందని చెబుతారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులు తిరగకుండానే మాకు పరిహారం అందించడం ఆనందంగా ఉంది. ఈ సొమ్ముతో ప్రభుత్వం కేటాయించే స్థలంలో ఇంటిని నిర్మించుకుంటాం. సహాయ శిబిరాల్లో అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఇల్లు కోల్పోయిన నాకు పరిహారం వెంటనే ఇవ్వడం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాలంటీర్ నుంచి ప్రతి అధికారి మా గురించి పట్టించుకుంటున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు .
addComments
Post a Comment