శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి):   మహామండపము 6 వ ఫ్లోర్ నందు  కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ హుండీ లెక్కింపు కార్యక్రమము నిర్వహించడం జరిగినది. హుండీ లెక్కింపు కార్యక్రమమును ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు , కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ


, దేవాదాయ శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది మరియు SPF  సిబ్బంది పర్యవేక్షించారు. 


ఈ రోజు హుండీ లెక్కింపు రిపోర్టు :-

లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ. 2,02,40,163/- లు.


హుండీల ద్వారా వచ్చిన బంగారం:  598 గ్రాములు, 


హుండీల ద్వారా వచ్చిన వెండి:  4 కేజీల 665 గ్రాములు 


గడచిన రోజులు : 14


భ‌క్తులు కానుక‌ల రూపంలో శ్రీ అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు.  గడచిన  రోజులలో సగటున రోజుకు రూ.14.45 లక్షల చొప్పున దేవస్థానం నకు హుండీల ద్వారా ఆదాయం చేకూరింది.


శ్రీ అమ్మవారి సేవలో...

కార్యనిర్వహణాధికారి.