కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అడ్వైజర్ (ఎన్డీఎంఏ) కునాల్ సత్యార్ధి నేతృత్వంలో రెండు బృందాలుగా

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ శాఖ  


 కుంచనపల్లి (ప్రజా అమరావతి);.


కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు  జిల్లాల్లో నవంబర్ 13 నుంచి 20 వరకు  కురిసిన భారీ వర్షాలు, వరదలు వల్ల  జరిగిన నష్టాలని అంచనా వేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం మూడు రోజులపాటు (నవంబర్ 26-28) ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు విపత్తుల శాఖ కమిషనర్  కె కన్నబాబు తెలియజేసారు.


కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అడ్వైజర్ (ఎన్డీఎంఏ) కునాల్ సత్యార్ధి నేతృత్వంలో రెండు బృందాలుగా పర్యటించనున్నారు.


శుక్రవారం 26-11-2021

బృందం చిత్తూరు జిల్లాలో పర్యటించనుంది.


శనివారం 27-11-2021

చిత్తూరు జిల్లాలో ఒక బృందం , వైయస్ఆర్ కడప జిల్లాలో ఒక బృందం  పర్యటించనుంది.


ఆదివారం 28-11-2021

నెల్లూరు జిల్లాలో రెండు బృందాలు పర్యటించనున్నాయి.


సోమవారం ఉదయం కేంద్రబృందం గౌరవ ముఖ్యమంత్రి గారితో సమావేశం కానున్నట్లు విపత్తుల శాఖ కమిషనర్ తేలియజేసారు.

Comments