నేటి నుంచి విశాఖలో దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలు

 

 


• నేటి నుంచి విశాఖలో దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలు


• ఐదు రాష్ట్రాల నుంచి 450 పైగా పోటీ దారులు.. 

• 52 విభాగాలు.. 10 వేదికలు..  

• డిసెంబర్ 1 నుంచి 4 వరకు నైపుణ్య పోటీలు

• విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ప్రారంభోత్సవ కార్యక్రమం 

• నైపుణ్య పోటీలను ప్రారంభించనున్న మంత్రి మేకపాటి గౌతం రెడ్డి

• ఎన్.ఎస్.డి.సి, ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో నైపుణ్య పోటీలు

 

విశాఖపట్నం (ప్రజా అమరావతి):


నేటి నుంచి నాలుగు రోజులపాటు విశాఖపట్నంలో దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలు జరగనున్నాయి. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్.ఎస్.డి.సి), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో 4 రోజులపాటు జరిగే నైపుణ్య పోటీలను నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణశాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రారంభిస్తారని ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి తెలిపారు. మొత్తం 52 విభాగాల్లొ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి 450 మంది పోటీ దారులు పాల్గొంటారు. ఇందుకోసం ఆంధ్రా యూనివర్సిటీసహా 10 వేదికల్లో పోటీలు జరుగుతాయి. విశాఖపట్నంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు జాతీయస్థాయిలో జరిగే నైపుణ్య పోటీల్లో పాల్గొంటారు. అక్కడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు మన దేశానికి ప్రానిథ్యం వహిస్తూ చైనాలోని షాంఘై నగరంలో సెప్టెంబర్ 2022లో జరగనున్న ప్రపంచస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. 


ఈ సందర్భంగా ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్.ఎస్.డి.సి) సహకారంతో విశాఖపట్నంలో దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలు నిర్వహించే అవకాశం రాష్ట్రానికి దక్కడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి నేతృత్వంలో యువతకు, విద్యార్థులకు అనేక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 

రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన 74 మంది మన రాష్ట్రం తరుఫున పోటీ పడుతున్నారని.. వారంతా మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని ఆయన ఆకాక్షించారు. 


అనంతరం నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి నుంచి 4వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలకు జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 31 ట్రేడ్స్ కు గాను 22వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. వీరిలో రాష్ట్ర స్థాయి పోటీలకు 240 మందికి పైగా ఎంపికయ్యారన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో 74 మంది విజేతలుగా నిలిచారన్నారు. వీరంతా ఇప్పుడు దక్షణాది రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో పాల్గొంటున్నారని చల్లా మధుసూదన్ రెడ్డి తెలిపారు. 4 రోజులపాటు జరిగే నైపుణ్య పోటీల్లో సత్తాచాటి జాతీయస్థాయిలో రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడంతోపాటు దేశానికి మన రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే విద్యార్థులు, యువత, నాణ్యమైన చదువు, నైపుణ్యాలు అనే నాలుగు అంశాలు ముఖ్యమైనవని.. వీటికి అత్యంత ప్రాధాన్య ఇస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు  నైపుణ్యాలు అందించేందుకు అంతర్జాతీయస్థాయి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని శిక్షణ ఇస్తోందన్నారు. 


అంతకుముందు ఎస్ఎమ్ఐఎస్ డివిజన్, కేంద్ర మంత్రిత్వ శాఖ మరియు వరల్డ్ స్కిల్స్ ఇండియా సీనియర్ హెడ్ కల్నల్ అరుణ్ చందేల్ మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలకు విశాఖపట్నం ఆథిత్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి నైపుణ్య పోటీలకు మన దేశంలో ఇండియా స్కిల్స్ పేరుతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో పోటీలు ముగిశాయని.. ఇక్కడ నాలుగు రోజులపాటు జరిగే పోటీల్లోనూ పోటీదారులంతా మంచి ప్రతిభ ప్రదర్శించాలన్నారు. దేశ వ్యాప్తంగా ఈ నైపుణ్య పోటీల కోసం 250,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. 26 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల్లో జరిగిన రీజినల్ లెవల్ కాంపిటీషన్లలో 1500 మందికిపైగా పోటీ పడ్డారని ఆయన తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న వారికి ఇప్పటికే అనేక విభాగాల్లో ప్రముఖ కంపెనీలతో శిక్షణ ఇప్పించామని.. బూట్ క్యాంప్స్, ప్రాజక్ట్ బేస్డ్ ట్రైనింగ్, కార్పొరేట్ ట్రైనింగ్ ఇప్పించామన్నారు. 2019లో జరిగిన ప్రపంచస్థాయి నైపుణ్య పోటీల్లో 63 దేశాలు పాల్గొంటే మనం 13వ స్థానంలో నిలిచామని.. ఈసారి చైనాలోని షాంఘైలో 2022 సెప్టెంబర్ లో జరిగే ప్రపంచ స్థాయి నైపుణ్య పోటీల్లో మెరుగైన స్థానం పొందడంతోపాటు దేశానికి పతకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకుసాగామన్నారు. 


విశాఖపట్నంలో నైపుణ్య పోటీలు జరిగే వేదికలు

1. ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ 

2. ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 

3. ప్రభుత్వ ఐటిఐ (పాతది), కంచెరపాలెం 

4. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎం.ఎస్.ఎం.ఈ) టెక్నాలజీ సెంటర్, 

5. స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్.డి.ఐ), ఆరిలోవా

6. సన్ సెనోరా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ

7. వరుణ్ మోటార్స్ 

8. అనూస్ సెలూన్ & క్లినిక్

9. అరేనా యానిమేషన్

10. ఎఫ్.ఎక్స్ యానిమేషన్ 



పోటీలు జరగనున్న 52 విభాగాలు:

1. 3D డిజిటల్ గేమ్ ఆర్ట్

2. ఆటోబాడీ రిపేర్

3. ఆటోమొబైల్ టెక్నాలజీ

4. బేకరీ

5. బ్యూటీ థెరపీ

6. బ్రిక్ లేయింగ్

7. క్యాబినెట్ మేకింగ్

8. కార్ పెయింటింగ్

9. కార్పెంటరీ

10. క్లౌడ్ కంప్యూటింగ్

11. సీఎన్సీ మిల్లింగ్

12. సీఎన్సీ టర్నింగ్

13. కాంక్రీట్ కన్ స్ట్రక్షన్ వర్క్

14. కుకింగ్

15. సైబర్ సెక్యూరిటీ

16. ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్స్  

17. ఎలక్ట్రానిక్స్

18. ఫ్యాషన్ టెక్నాలజీ

19. ఫ్లోరిస్ట్రీ

20. గ్రాఫిక్ డిజైన్ టెక్నాలజీ

21. హెయిర్ డ్రెస్సింగ్

22. హెల్త్ అండ్ సోషల్ కేర్

23. హోటల్ రిసెప్షన్

24. ఇండస్ట్రియల్ కంట్రోల్

25. ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ కేబులింగ్

26. ఐటి నెట్‌వర్క్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్

27. ఐటి సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ఫర్ బిజినెస్

28. జ్యువెలరీ

29. జాయినరీ

30. ల్యాండ్‌స్కేప్ గార్డెనింగ్

31. ఎంక్యాడ్ (MCAD)

32. మెకాట్రానిక్స్

33. మొబైల్ రోబోటిక్స్

34. పెయింటింగ్ అండ్ డెకొరేటింగ్ 

35. పాటిస్సేరీ మరియు కాన్ఫెక్షనరీ

36. ప్లాస్టరింగ్ అండ్ డ్రైవాల్ సిస్టమ్స్ 

37. ప్లాస్టిక్ డై ఇంజనీరింగ్

38. ప్లంబింగ్ అండ్ హీటింగ్ 

39. ప్రింట్ మీడియా టెక్నాలజీ

40. ఇండస్ట్రియల్ డిజైన్ టెక్నాలజీ

41. రిఫ్ట్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్

42. రెస్టారెంట్ సర్వీస్

43. విజువల్ మర్చండైజింగ్

44. ఇండస్ట్రీ 4.O

45. వాటర్ టెక్నాలజీ

46. వెబ్ టెక్నాలజీస్

47. వెల్డింగ్

48. రోబోట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్

49. యాటివ్ మ్యానుఫ్యాశ్చురింగ్ 

50. డిజిటల్ కన్ష్ట్రక్షన్

51. మొబైల్ అప్లికేషన్స్ డెవలప్‌మెంట్

52. రిన్యూవబుల్ ఎనర్జీ

Comments