సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు.


అమరావతి (ప్రజా అమరావతి);


శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు.



టీడీపీ హయాంలో ఎడతెగని పోరాటం చేసిన యడవల్లి దళిత రైతులకు న్యాయం చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్, వారి భూములకు ప్రభుత్వం తరపున పరిహారం చెల్లించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం.


యడవల్లి సొసైటీ భూములను ప్రభుత్వం తీసుకుని రైతులకు రూ. 30 కోట్లు పరిహారం చెల్లించి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు*


*ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించడంతో హర్షం వ్యక్తం చేస్తూ సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను సత్కరించిన యడవల్లి దళిత రైతులు.


చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసిన రైతులు.

Comments