విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ

 విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ   గుంటూరు (ప్రజా అమరావతి);   చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన పి.విజయలక్ష్మికి  తమ యూనివర్సటీ   పీహెచ్‌డీ పట్టా అందించిందని ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ డిజైన్‌ ఆఫ్‌ లో పవర్‌ అనలాగ్‌ ఫ్రంట్‌ ఎండ్‌ ఇంటెండెడ్‌ ఫర్‌ ఈసీజీ సిగ్నల్‌ అక్విజిషన్‌ సిస్టమ్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని  ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.శారద, హర్యానాలోని గురుగ్రామ్‌ కేఆర్‌ మంగళం యూనివర్సిటీ ప్రో వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ అవిరేని శ్రీనివాసులు సంయుక్త  గైడ్‌లుగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 1 ఎస్‌సీఐ, 1 ఈఎస్‌సీఐ, 3 స్కూపస్‌ జర్నల్‌ పబ్లికేషన్, ఒక స్కూపస్‌ బుక్‌ చాప్టర్, 2 ఐఈఈఈ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు.