శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం
(ప్రజా అమరావతి):
దేవస్థానము నందు కార్తీక మాస సోమవారం సందర్భముగా కాఠక పారాయణలు, జపములు, సహస్రలింగార్చన సేవలు జరిగినవి. మరియు మల్లేశ్వర స్వామివారికి లక్షభిల్వార్చన (మధ్యాహ్నం 02 గం.ల నుండి 07 గం.లకు) సేవ నిర్వహించబడినది. అనంతరం ఊంజల్ సేవ మరియు సహస్రదీపాలంకరణ సేవలో పలువురు భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాసము సందర్భముగా మల్లేశ్వరాలయము వద్ద జరుగు లక్షభిల్వార్చన (మధ్యాహ్నం 02 గం.ల నుండి 07 గం.లకు) సేవ తదుపరి ది.15-11-2021, ది.19-11-2021, ది.22-11-2021, ది.29-11-2021, ది.30-11-2021 మరియు ది.02-12-2021 రోజుల యందు జరుగును. కార్తీకమాసము నందు ప్రత్యేకముగా జరుపబడు లక్ష భిల్వార్చన(రూ.2000 /- లు), సహస్ర లింగార్చన(మ.గం. 03-00 ల నుండి సా. 07 గం.ల వరకు) (ఒక రోజునకు రూ.500 /-లు టిక్కెట్, నెలకు రూ.5116 /- లు), ఊంజల్(సహస్ర దీపాలంకరణ) సేవ(రూ.50 /- లు) మరియు ఇతర ఆర్జిత సేవా టికెట్లు వెబ్సైటు www.aptemples.ap.gov.inనందు గానీ, దేవస్థానం కౌంటరు యందు కానీ పొందగలరు.
addComments
Post a Comment