గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా జూనియర్, సీనియర్ విభాగంలో పిల్ల లకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించడం జరిగిందని లైబ్రరీయన్ జీ.వి.విఎన్.త్రినాధ్ తెలిపారు.

 


కొవ్వూరు డివిజన్  (ప్రజా అమరావతి);


గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా జూనియర్, సీనియర్ విభాగంలో పిల్ల లకు  చిత్ర లేఖనం పోటీలు నిర్వహించడం జరిగిందని లైబ్రరీయన్ జీ.వి.విఎన్.త్రినాధ్ తెలిపారు.



 గురువారం ఉదయం 54వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా కొవ్వూరు ప్రధమ శ్రేణి జిల్లా శాఖా గ్రంధాలయంలో  చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. 


ఈ సందర్భంగా త్రినాధ్ మాట్లాడుతూ, దేశభక్తి పట్ల పిల్లల్లో ఆసక్తి పెంచేందుకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించామన్నారు. పాఠశాల విద్యార్ధులకు  జూనియర్ కళాశాల విద్యార్ధులకు జూనియర్ విభాగంలో "మీకు నచ్చిన జాతీయ చిహ్నం" , సీనియర్ విభాగంలో "మీకు నచ్చిన జాతీయ నాయకులు" అంశంపై చిత్రలేఖనం పోటీలను నిర్వహించామన్నారు.  ఈ పోటీలలో వివిధ పాఠశాల లు, జూనియర్ కాలేజీ విద్యార్థులు సుమారు 210 మంది పైగా విద్యార్థిని, విద్యార్ధులు ఈ పోటీలో పాల్గొన్నారని తెలిపారు.



ఈ కార్యక్రమంలో , ఉపాధ్యయురాలు బి.ప్రమీల, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


Comments