*"వరద ప్రభావిత ప్రాంతాలలో కాకాణి
"*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం,పొదలకూరు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టవలసిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు.
భారీ వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి అండగా నిలిచి, సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం.
నారుమళ్లు దెబ్బతిన్న రైతాంగానికి, తక్షణమే విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతాం.
వరి నాట్లు దెబ్బతిన్న రైతాంగానికి అధికారులు అంచనాలు పూర్తిచేసిన వెంటనే ఇన్ పుట్ సబ్సిడీ అందజేస్తాం.
వరద ప్రభావంతో కోతకు గురైన, ఇసుక మేట వేసిన పొలాలకు నష్టపరిహారం అందజేయడం జరుగుతుంది.
రైతాంగానికి సాఫీగా సాగునీరు అందించేందుకు చెరువులు, కాలువలకు అవసరమైన మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం.
పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ళ వివరాలు సేకరించి, ఆర్థిక సహాయం అందిస్తాం.
వరద నీరు చేరి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు బియ్యం, నూనె, కందిపప్పు, ఎర్రగడ్డలు, ఉల్లిగడ్డలతో పాటు, ఆర్థిక సహాయం అందిస్తున్నాం.
గ్రామాలలో విద్యుత్ సౌకర్యం, తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే మరమ్మతులు పూర్తి చేశాం.
విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున సచివాలయాల ఏ.యన్.యమ్.లు, ఆశా వాలంటీర్లను అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరాం.
దెబ్బతిన్న చేపల చెరువులు, రొయ్యల గుంటలకు అంచనాలు తయారు చేసేందుకు వెంటనే మత్స్యశాఖ అధికారులు పర్యటించి, పరిశీలించి, అందించే నివేదిక ప్రకారం నష్టపరిహారం చెల్లింపులు చేపడుతాం.
అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన వసతి, సదుపాయాలు తాత్కాలిక ప్రాతిపదికన తక్షణమే పూర్తి చేసి, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడతాం.
మరో భారీ వర్ష సూచన ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాం.
భారీ వర్షాలు కురిసి, వరదల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమర్ధవంతంగా విధులు నిర్వహించిన అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
addComments
Post a Comment