విద్యార్థుల్లో సేవా భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు

 విజయవాడ (ప్రజా అమరావతి);   బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కె.ఎల్. విశ్వవిద్యాలయం కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగం,ఏస్ క్లబ్ విద్యార్థిని విద్యార్థులు విజయవాడలోని చైల్డ్ ఎయిడ్ ఫౌండేషన్ లోని బాలబాలికలకు స్టేషనరీ వస్తువులు, చాక్లెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, విద్యార్థుల్లో సేవా భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు


చేస్తున్నామని అన్నారు. కులమతాలకు అతీతంగా సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఒక బీజం లాంటిదని తెలిపారు. విశ్వవిద్యాలయంలోని వివిధ క్లబ్ ద్వారా ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, విద్యార్థులకు సమాజం పట్ల ఉండే బాధ్యత గుర్తు చేస్తూ, వాటిని పాఠ్యప్రణాళికలో భాగం చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగాధిపతి డాక్టర్ భగవాన్, డాక్టర్ కిరణ్ బాబు, విద్యార్థులు పాల్గొన్నారు