విద్యార్ధులకు చదువుకునే సమయంలోనే ఉద్యోగావశాలు కల్పించేలా ప్రోగ్రామ్ డిజైన్

 తాడేపల్లి (ప్రజా అమరావతి);       అమెరికాలోని ఐటి కంపెనీల్లో పనిచేయడానికి అర్హతలున్న సిబ్బందిని ఎంపిక చేసేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ అనే సరికొత్త కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) శ్రీకారం చుట్టింది. ఈ మేరకు తాడేపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి(నార్త్ అమెరికా) పండుగాయల రత్నాకర్, ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండీ బంగార రాజు, సిజిఎం టెక్నికల్ డాక్టర్ రవి గుజ్జుల రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ పోస్టర్ ను విడుదల చేశారు.  


ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీల్లో రిక్రూట్ మెంట్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కు డిమాండ్ ఉందన్నారు. అందుకు అవసరమైన హ్యూమన్ రిసోర్స్ మనదగ్గర చాలా ఉందని.. అమెరికాలో ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఏపీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నామని.. విద్యార్ధులకు చదువుకునే సమయంలోనే ఉద్యోగావశాలు కల్పించేలా ప్రోగ్రామ్ డిజైన్


చేశామన్నారు. 


ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి(నార్త్ అమెరికా) పండుగాయల రత్నాకర్ మాట్లాడుతూ.. ఒక ఐటీ కంపెనీ టెక్నికల్ రిక్రూట్‌మెంట్/సేల్స్‌ సిబ్బంది ఎంపిక కోసం మొత్తం లేదా కొంత భాగాన్ని క్లయింట్‌లకు వారి ఐటి సిబ్బంది అవసరాల కోసం బదిలీ చేస్తుంద్నారు. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ విధానం ద్వారా ఐటీ రంగంలో పనిచేయడంలో సమర్థులైన వారిని ఎంపిక చేసి వారిని అమెరికాలోని ఐటీ కంపెనీలకు కనెక్ట్ చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. అంతర్జాతీయస్థాయిలో ఈ తరహా ఉద్యోగాలు 5వేల నుంచి 10వేల వరకు ఉన్నాయని 

ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారు చదువుకుంటూ ఉండగానే  ఈ కార్యక్రమం ద్వారా 15 నుంచి 20వేల రూపాయల బోనస్ గా పొందవచ్చని ఆయన చెప్పారు. శిక్షణ కోసం ఎంపిక చేయడానికి ముందుగా 30 నిమిషాలపాటు సాధారణ ఇంగ్లీష్ పరీక్ష, అభ్యర్థి గురించి చెబుతూ రెండు నిమిషాల వీడియో తీసి పంపాల్సి ఉంటుంది. మంచి కమ్యునికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్ రాయడం వచ్చి ఉండాలి. ఎంపికైన వారికి కమ్యునికేషన్ అండ్ లైఫ్ స్కిల్స్, ప్రజెంటేషన్, బిహేవియరల్ స్కిల్స్, బిజినెస్, ఈమెల్స్ రాయడం, టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇస్తారని  పండుగాయల రత్నాకర్ తెలిపారు. 


ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఎపిఎస్‌ఎస్‌డిసి వెబ్ సైట్ www.apssdc.in గానీ, సంస్థ కాల్ సెంటర్ నంబర్ 9988853335 కి కాల్ చేసి తెలుసుకోవచ్చని ఎపిఎస్‌ఎస్‌డిసి సిజిఎం టెక్నికల్ డాక్టర్ రవి గుజ్జుల తెలిపారు.

Comments