ఇళ్ల పట్టాల వన్ టైం సెటిల్ మెంట్ పై ప్రజలకు అవగాహన కల్పించండి'*
*'మధ్యాహ్న భోజన పథకం పై నిరంతర పర్యవేక్షణ చేయండి'*
*'చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి'*
*'పుష్కలంగా వ్యాక్సిన్ నిల్వలున్నాయి.. రెండో డోసు పూర్తి చేయండి'*
*స్పందన సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి*
అనంతపురము, నవంబరు 15 (ప్రజా అమరావతి);
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలోని వీసీ భవనం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'స్పందన' సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ప్రధానంగా హౌసింగ్ వన్ టైం సెటిల్ మెంట్, ఉపాధి హామీ నిర్మాణాలు, వైయస్సార్అర్బన్ క్లినిక్కుల నిర్మాణం, జగనన్న పాలవెల్లువ, సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు, వ్యాక్సినేషన్ సర్వేలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు
• హౌసింగ్ వన్ టైం సెటిల్ మెంట్ లో లబ్ధిదారులకు పథకంపై అవగాహన కల్పించాలి. వన్ టైం సెటిల్ మెంట్ ద్వారా అతి తక్కువ మొత్తం ప్రభుత్వానికి కట్టడం ద్వారా గతంలో రుణాల ద్వారా ఇల్లు పొందిన వారికి ఇంటిపై సర్వహక్కులు అందిస్తూ ప్రభుత్వమే పట్టా అందిస్తుందనే విషయం లబ్ధిదారులందరికీ తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి.
• గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు తదితర నిర్మాణాలు వేగవంతం కావాలి. ఇప్పటికే పూర్తయిన చెత్త నుండి సంపద కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలి. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో చెత్త నుండి సంపద కేంద్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి. పాఠశాలల్లో బాలికలకు అందించే సానిటరీ న్యాప్కిన్లను డిస్పోజ్ చేసేందుకు కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేయండి.
• వైయస్సార్అర్బన్ క్లినిక్కుల నిర్మాణానికి స్థలాల ఎంపిక పూర్తి చేశాం. నిర్మాణాలు వేగవంతం చేయండి.
• జిల్లాలో మూడు లక్షల వ్యాక్సిన్ డోసుల నిల్వలున్నాయి. రెండో డోసు పెండింగ్ లో ఉన్నవారికి వ్యాక్సినేషన్ పూర్తి చేయండి. వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా సాగండి.
• మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించాలి. ఎంపీడీవోలకు రోజువారి మెనూపై అవగాహన ఉండాలి. ప్రతి రోజూ రెండు పాఠశాలలు సందర్శించి పథకం అమలును పరిశీలించాలి. పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, రుచి విషయాల్లో రాజీ ఉండకూడదు.
ఈ కార్యక్రమంలో జేసీలు ఏ.సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్ లు, సీపీవో ప్రేమ్ చంద్, జెడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి, డ్వామా పీడీ వేణు గోపాల్ రెడ్డి మరియు మండలాల ఇంచార్జులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment