కోవిడ్ థర్డ్‌ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉండాలి * రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ

 కోవిడ్ థర్డ్‌ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉండాలి

* రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ


అమరావతి, (ప్రజా అమరావతి):  కోవిడ్ థర్డు వేవ్ వస్తే దాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ రాష్ట్ర  వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.  అమరావతి సచివాలయం ఒకటో బ్లాక్ లో ఆయన అద్యక్షతన కోవిడ్-19 వేక్సినేషన్ కార్యక్రమంపై రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది.  రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిఫల్  కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తో పాటు కమినషర్  కాటమనేని భాస్కర్ ఈ సమవేశంలో పాల్గొని పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా రాష్ట్రంలో జరుగుచున్న కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం ప్రగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కోవిడ్ థర్డు వేవ్ ను ప్రణాళిక బద్దంగా ఎదుర్కొనేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వారికి సూచించారు. థర్డు వేవ్ కోవిడ్ ను గుర్తించి, అందుకు అనుగుణంగా యుద్ద ప్రాతిపదిక చర్యలు చేపట్టేందుకు వైద్య, ఆరోగ్య శాఖ వద్ద అందుబాటులో నున్న ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వలెన్సు  ప్రాజెక్టు, ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్పర్మేషన్ ప్లాట్ ఫార్ము, కమ్యునికేషన్ వ్యవస్థల పనితీరుపై ఆయన  ఆరా తీశారు. క్షేత్ర స్థాయిలోని వైద్య, ఆరోగ్య సిబ్బంది డోర్ టు డోర్ సర్వే ద్వారా  ఏవిధంగా  జ్వరాలు, కోవిడ్ లక్షణాలను గుర్తించి, ఎటు వంటి వైద్య సేవలు అందజేస్తున్నారో తెలుసుకున్నారు.  రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు, ఔషదాల పంపిణీకి వైద్య సిబ్బంది అనుసరిస్తున్న కార్యాచరణ ప్రణాళికపై ఆరాతీశారు. ఒకవేళ కోవిడ్ పాజిటివ్‌గా గుర్తించిన వారికి అందజేసే ప్రత్యేక వైద్య సేవలు, తగినన్ని ఆక్సిజన్ బెడ్ల నిర్వహణ,  కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు,  కాంటాక్టు ట్రేసింగ్ గుర్తించేందుకు, కంటైన్ మెంట్ జోన్ల ఏర్పాటుకు  వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.  అదే విధంగా  వేక్సినేషన్ ఫస్టు, సెకండ్  డోస్  డ్రైవ్ ల నిర్వహణలో వెనుకబడి ఉన్నట్లు గుర్తించిన శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి తదితర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో ఆ డ్రైవ్ లను పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టాలని వారికి సూచించారు.