రేపు సోమవారం - నాగులచవితి

 రేపు సోమవారం - నాగులచవితి

    ఈ రోజున సూర్యోదయానికి ముందుగా ఆకాశంలో తూర్పుదిక్కులో శేషుని నక్షత్ర రూపం దర్శనం ఇస్తుంది. ఈ రోజున వారి వంశాచారాన్ననుసరించి నాగేంద్రుని ఉద్దేశించి పుట్టలో పాలుపోసి, చలిమిడి, వడపప్పు, నువ్వులతో చేసిన తీపి పదార్థాలు మొదలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు. దీనివలన ప్రీతుడైన నాగేంద్రుడు ఆ కుటుంబాలకు అనారోగ్యాలు, అరిష్టాలు కలుగకుండా రక్షిస్తాడు. నాగుల చవితినాడు రైతులు మొదలైన వారు పనిముట్లను ఉపయోగించరాదు. ఇళ్ళల్లో కూరగాయల్ని కోసేందుకు సైతం కత్తిపీటల వంటివి ఉపయోగించకుండా కోయనవసరంలేని కూరగాయలతో వండుకు తినాలి.


      


Comments