చిత్తూరు జిల్లా సోమల మండలం (ప్రజా అమరావతి);
రెండవ రోజు కేంద్ర బృందం చిత్తూరు జిల్లా లో పర్యటన
ఇంటర్ మినిస్టీరియ ల్ సెంట్రల్ టీమ్ సభ్యులు అభేకుమార్,డైరెక్టర్,మిని స్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు జిల్లా లో కురిసిన వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయి లో పరిశీలించు టలో భాగంగా శనివారం సాయంత్రం చిత్తూరు జిల్లా సోమల మండ లం లో జరిగిన పంట నష్టం ను పరిశీలిం చారు.
సోమల మండలం లో తొలుత ఇరికి పెంట-చెన్న పట్నం చెరువు వద్ద డ్యామేజ్ అయిన రోడ్డును మరి యు పంట నష్టం ను పరిశీలించారు..
అనంతరం ఎస్.నడిం పల్లి వద్ద కురక పల్లి చెరువు కింద 20 ఎకరాలలో సాగుచేసి దెబ్బతిన్న వరి పంటను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు.
తదుపరి ఎస్.నడిం పల్లి లో 15 ఎకరాల లో పూర్తిగా దెబ్బ తిన్న టమోటా పంట ను కేంద్ర బృందం సభ్యులు పరిశీలిం చగా ఒక ఎకరా పంట సాగుకు దాదాపు గా 2 లక్షల ఖర్చు అవు తుందని, చెట్టుకు తేమ ఎక్కువై కాయ మొత్తం పాడై పోయి రాలి పోతున్నదని,ఈ వర్షాలు రాక పోయి ఉంటే కిలో 50 రూపా యలు చొప్పున ధర పలికిన కూడా ఎకరా కు 30 టన్నులకు పంట వచ్చినా కూడా ఆదాయం రూ.15 లక్షలు వచ్చేదని, ప్రస్తుతం పూర్తి గా పంట నష్టపోయామని రైతు చంద్ర మౌళి తన బాధ ను కేంద్ర బృం దం సభ్యులకు వివరిం చారు..
తదుపరి ఇరికిపెంట గ్రామం నందు 1.5 ఎకరాలలో సాగుచేసి దెబ్బతిన్న టమాటా పంటను పరిశీలిం చారు.. పంట వేసిన తరువాత ఒక కోత కూడా కోసి మార్కెట్ కి పంటను తరలించ లేదని ఎకరాకు రెండు లక్షల దాకా ఖర్చు చేశామని ఒక రూపాయి కూడా రాలేదని రైతు శివయ్య నాయుడు తన ఆవేదన ను వ్యక్తం చేయగా.. పలువురు రైతులు తమకు చేయూత ను అందిం చాలని వేడు కొన్నారు...
సోమల మండలం లో 1985 ఎకరాలలో పంట నష్టం జరగగా 1931 మంది రైతులు నష్టపోయారని, ఇందులో 1957 ఎకరాలలో వరి పంట సాగు చేయగా, 26 ఎకరాలలో వేరుశెనగ, రెండు ఎకరాల్లో చెరకు సాగు చేసే చేశారని ఈ పంట మెత్తగా దెబ్బతిన్న దని అధికారులు వివరించారు...*
ఈ పర్యటనలో కేంద్ర బృందం సభ్యులు వెంట మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ జె.డి లు దొరసాని, వెంకట్రావ్,ఉద్యాన వన శాఖ డి డి శ్రీనివాసులు,ఇతర మం డల స్థాయి అధి కారులు,ప్రజా ప్రతి నిధులు, రైతులు కలరు.
addComments
Post a Comment