అమరావతి (ప్రజా అమరావతి).
"నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా .." అంటూ ప్రతి పాటలో ఎన్నో ప్రశ్నలను సంధించి సమాజాన్ని చైతన్యపరచిన సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఇలా అకస్మాత్తుగా మన మధ్య నుంచి భౌతికంగా దూరమవడం పట్ల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎలాంటి పాటలోనైనా, ఏ విధమైనా బాణీ ఇచ్చినా సమాజానికి అక్షరాలతో సందేశమిచ్చే ఆయన శైలి నేటి తరం రచయితలు, కవులకు ఆదర్శనీయమన్నారు. స్ఫూర్తి, సందేశం, సామాజిక బాధ్యత,చైతన్యం, ఆలోచన ధోరణి మేళవించిన మాటలతో మూడున్నర దశాబ్ధాలపాటు తన ప్రతి పాటలో తెలుగు సినిమా పాటను అందలమెక్కించిన గొప్ప రచయితను కోల్పోవడం శోచనీయమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
addComments
Post a Comment