మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం.*వర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


అమరావతి (ప్రజా అమరావతి); 

*భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లతో సచివాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష.* 


*భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌*

*మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం*
*వర్షాలపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు:*

నెల్లూరుకు సీనియర్‌ అధికారి రాజశేఖర్, చిత్తూరుకు సీనియర్‌ అధికారి ప్రద్యుమ్న, కడపకు మరో సీనియర్‌ అధికారి శశిభూషణ్‌ కుమార్‌లను నియమించామని తెలిపిన అధికారులు

వారు ఇప్పటికే చేరుకున్నారని తెలిపిన అధికారులు

గతంలో వాయుగుండం కారణంగా భారీవర్షాలు కురిశాయి

ఇప్పుడు కూడా తీవ్ర వాయుగుండం కారణంగా కూడా భారీవర్షాలు కురుస్తున్నాయి

ప్రస్తుతం ఇది తమిళనాడులో తీరందాటింది

దీని ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురిశాయి

ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్‌ కడప జిల్లాల్లో గత రాత్రి నుంచి వర్షం తగ్గుముఖం పట్టిందన్న సమాచారం వస్తోంది

చెరువులకు అక్కడక్కడా గండ్లు పడినట్టు సమాచారం వస్తోంది

ముంపు బాధితులను కూడా వెంటనే సహాయక కేంద్రాలకు తరలించాం

వరదలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించే చర్యలు కూడా చేపట్టాం

సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీలేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం

ఆయా జిల్లాలకు అదనంగా నిధులు కూడా ఇచ్చాం


*అనంతరం జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*

*జిల్లాల్లో పరిస్థితులను వివరించిన కలెక్టర్లు*


*చిత్తూరు జిల్లాలో పరిస్థితులను వివరించిన కలెక్టర్‌ హరినారాయణ్, స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రద్యుమ్న*


తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశం

చెరువుల పూడ్చివేత వల్ల ఇది జరిగిందని తెలిపిన అధికారులు

దీనిపై తగిన కార్యాచరణను సిద్ధం చేయాలన్న సీఎం

బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని సీఎం ఆదేశం

ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని సీఎం ఆదేశం

ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందన్న సీఎం

బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలన్న సీఎం

మంచి భోజనం, తాగునీరు అందించాలన్న సీఎం

వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం


*తిరుమల భక్తులకూ సాయం*

తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని సీఎం  ఆదేశం

రైళ్లు, విమానాలు రద్దయిన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలని సీఎం ఆదేశం

ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో వారిని కిందకు రాకుండా పైనే ఉంచాలని ఆదేశాలు

కనీసం ఒకటి, రెండు రోజులు వారికి తగిన వసతులు సమకూర్చాలని ఆదేశం

టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుని యాత్రికులకు సహాయంగా నిలవాలి అధికారులకు సీఎం ఆదేశం.


తిరుపతి నగరంలో మున్సిపాల్టీ సహా, ఇతర సిబ్బందిని కూడా వినియోగించి పారిశుధ్యం పనులు చేపట్టాలని సీఎం ఆదేశం

అవసరమైతే ఇతర మున్సిపాల్టీలనుంచి సిబ్బందిని తీసుకు వచ్చి ఆపరేషన్‌ చేపట్టాలన్న సీఎం


*వైయస్సార్‌ జిల్లాలో పరిస్థితులను వివరించిన కలెక్టర్‌ విజయరామరాజు*

గండ్లుపడ్డ చెరువుల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: సీఎం

రోడ్లకు గండ్లు కారణంగా ఎక్కడ రవాణా స్తంభించినా... నీరు తగ్గగానే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి:

ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి:

విద్యుత్‌ పునరుద్ధరణపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి: సీఎం

వరదనీరు తగ్గగానే పంట నష్టంపై అధికారులు ఎన్యుమరేషన్‌ ప్రారంభించాలి:


*నెల్లూరుజిల్లాలో పరిస్థితులను వివరించిన కలెక్టర్‌ చక్రధర్‌*

సోమశిలకు భారీగా వరద నీరు వస్తోందన్న కలెక్టర్‌

సమగ్ర వ్యూహంతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశాలు

పైనుంచి వరదను, డ్యాంలో ప్రస్తుతం ఉన్ననీటిని అంచనా వేసుకుని ఆమేరకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

నీటిపారుదల శాఖ అధికారులను సమన్వయం చేసుకుని వరదనీటి విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం

ఎక్కడెక్కడ ముంపు ఉండే అవకాశాలు ఉన్నాయో.. ఆయా ప్రాంతాల్లో సహాయక కేంద్రాలను తెరవాలని సీఎం ఆదేశం


*అనంతపురంలో భారీ వర్షాల పరిస్థితిని వివరించిన కలెక్టర్‌ నాగలక్ష్మి*

*వర్ష బాధిత జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లపై వివరాలు అందించిన ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పీఆర్‌ అండ్‌ ఆర్‌డి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది*


ఈ ప్రాంతాల్లో రోడ్ల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

అలాగే తాగునీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం

ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి... తాగునీటి నాణ్యతను తెలుసుకోవాలని, వ్యాధులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

పారిశుధ్యంపైనకూడా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం


*త్వరగా పరిహారం అందించాలి* 

ఎక్కడెక్కడ పంట నష్టపోయిందీ వివరాలు తయారు చేయాలి: అధికారులకు సీఎం ఆదేశం

వీలైనంత త్వరగా వారికి పరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి:

నష్టాన్ని నమోదు చేసినప్పుడు కాస్త ఉదారతతో ఉండాలి:

మరలా పంట వేసుకునేందుకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలి:

వర్షాల కారణంగా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం వీలైనంత త్వరగా అందించాలి : సీఎం ఆదేశం

జిల్లాల్లో కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలి:

వచ్చే వినతులపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలి:

ఎలాంటి సహాయం కావాలన్న యుద్ధప్రాతిపదికన సమకూరుస్తాం:


నెల్లూరులో సహాయక చర్యల పర్యవేక్షణకు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ను పంపిస్తున్నాం: సీఎం

కడపజిల్లాల్లో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ఇప్పటికే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాన్న ముఖ్యమంత్రి. 


సచివాలయం నుంచి వీసీలో పాల్గొన్న హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత, జలవనరులశాఖమంత్రి పి అనిల్‌ కుమార్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్,  డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ కమిషనర్‌ కె కన్నబాబు ఇతర ఉన్నతాధికారులు.