ప్రాణాలు తెగించి కాపాడిన పోలీసు శాఖకు ఎంతగానో రుణపడి

 SPS నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);


కొడవలూరు శివాలయంలో పనిచేస్తున్న పూజారి కుమారుడు సునీల్  వెంకటేశ్వరపురం బ్రిడ్జ్ వద్ద బైకు మీద వెళుతూ వరద నీటిలో కొట్టుకొనిపోతుండగా, ట్రాఫిక్ CI శ్రీ రాములు నాయక్ గారు తక్షణమే స్పందించి, సాహసంతో అతనిని కాపాడినందుకుగాను, నెల్లూరు బ్రాహ్మణ సంఘం మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ గౌరవ యస్.పి.గారిని కలిసి ఆనందబాష్పాలతో మేమందరం ప్రాణాలు తెగించి కాపాడిన పోలీసు శాఖకు ఎంతగానో రుణపడి ఉంటామని, ఇటీవలే కరోనాతో వారి తండ్రి గారు మరణించారు. పొరపాటున సునీల్ మరణించి ఉంటె మా కుటుంబం మొత్తం రోడ్డున పడి ఉండేదని, దిక్కులేని అనాదలై ఉండేవారని విలపించారు. జీవితాంతం మీ త్యాగాన్ని స్మరించుకుంటామని వాపోయారు. మా పూజారిని కాపాడినందుకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని, మీ లాంటి ఆఫీసర్ గారు మా జిల్లాకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నామని, ఇలాగే మీరు అందరి మన్ననలు పొందుతూ ఎల్లవేళలా బాగుండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంతో ధైర్య సాహసాలతో కాపాడిన  ట్రాఫిక్ CI శ్రీ నాయక్ గారిని గౌరవ యస్.పి.గారు అభినందించారు...

Comments