శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
శ్రీ ఫరధాల మణి అను భక్తుడు శ్రీ అమ్మవారి గర్భాలయము మరియు అంతరాలయము నందు ఉపయోగించు ఫరధాలు-2 ను తను మడితో, ఉపవాస దీక్షతో నిష్ఠగా ఉండి స్వయముగా ఈ ఫరధాలను నేసి శ్రీ అమ్మవారి సేవ నిమిత్తం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానం నకు కానుకగా అందజేశారు. మరియు త్వరలో శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయమునకు కూడా తాను స్వాంతముగా నేసిన ఫరధాలు అందజేయనున్నారని తెలిపారు. అనంతరం
అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు దాతకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.
వీరు తిరుపతి, కాణిపాకం, కాళహస్తి మరియు రాష్ట్రంలో ని పలు ప్రముఖ దేవాలయములకు ఈ విధముగా వారి సేవను అందించినట్లు తెలిపారు..
addComments
Post a Comment