సమాజ మార్పులో యువతే కీలకం: భారత దేశ ప్రధాన న్యాయమూర్తి
పుట్టపర్తి, నవంబర్22 (ప్రజా అమరావతి): ఆధునిక ప్రపంచంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణల వైపు ప్రతి విద్యార్థి అడుగులు వేయాలని భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం పుట్టపర్తిలోని సత్య సాయి విద్యాలయం 40వ స్నాతకోత్సవం నందు భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 96 వ జయంతిని పురస్కరించుకుని సత్యసాయి విశ్వవిద్యాలయం ఉపకులపతి చక్రవర్తి అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించారు. స్నాతకోత్సవం కన్నుల పండుగగా జరిగింది సాయి కుల్వంత్ మందిరములో సర్వాంగసుందరంగా ముస్తాబైన మహా సమాధి చెంత వేడుకలు ప్రారంభమయ్యాయి. సత్యసాయి యజుర్వేద మందిరం నుంచి బ్రాస్ బాండ్ మేళ తాళాలతో విశ్వవిద్యాలయ కులపతి, ఉపకులపతులు, ముఖ్య అతిథులు, ట్రస్ట్ సభ్యులు ఆచార్యులు మందిరానికి చేరుకున్నారు, కులపతి చక్రవర్తి మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో విశ్వవిద్యాలయం ముందుకు సాగుతుందని, ఇందుకు వివిధ వేదికలపై తమ విద్యార్థులు సాధిస్తున్న ఫలితాల నిదర్శనమన్నారు. నలభై సంవత్సరాలుగా సత్య సాయి విద్యా సంస్థలు సాధించిన విజయ లక్ష్యాలను వివరించారు. అనంతరం ముఖ్య అతిధి జస్టిస్ ఎన్ వి రమణ మాట్లాడుతూ సత్య సాయి విద్యా సంస్థలు మానవతా విలువలకు పెద్దపీట వేస్తున్నాయి . విలువలతో కూడిన విద్యను అందించి ఉత్తమ సమాజాన్ని స్థాపించాలని సంకల్పంతో బాబా సత్య సాయి విద్యా సంస్థ లు నెలకొల్పడానికి పేర్కొన్నారు. ఆ విద్యా సంస్థలు దేశ విదేశాలలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి మంచి ఫలితాలు సాధించున్నాయని పేర్కొన్నారు. పురాణాలు, ఇతిహాసాలు పాత చింతకాయ పచ్చడి అంటూ కొట్టిపారేయడం నేటి తరానికి పరిపాటైపోయింది. కానీ రామాయణ, మహాభారతాలలో సమ కాలిన సమాజానికి వర్తించే సందేశాలు ఎన్నో ఉన్నాయి. ధర్మం, న్యాయం ఆధారంగా నెలకొన్న చట్టాలను ప్రజల రక్షణ కోసం, ప్రధానంగా, బలహీనులు, మహిళలు, బాలల రక్షణ కోసం అమలు చేయడమే రాజ ధర్మం అని పురాణాలు చెబుతున్నాయి అని పేర్కొన్నారు. ముఖ్య అతిథులు చేతులమీదుగా 20 మంది విద్యార్థులు బంగారు పతకాలు, 24 మందికి డాక్టరేట్లు,465 మందికి పట్టాలను ప్రధానం చేశారు.
అనంతరం సత్య సాయి గతంలో జరిగిన స్నాతకోత్సవం లో భక్తులకు చెప్పిన విషయాలను తాడిపత్రి అక్కడ పెట్టు కదరాతెరపై ప్రదర్శించారు. అనంతరం జాతీయ గీతం ఆలపిస్తూ భజన కార్యక్రమాలు పూర్తి కాగానే మహా మంగళ హారతి తో స్నాతకోత్సవం ముగించారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి justice రీతు రాజ్ awasthi, జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి రమేష్, సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్ట్ ఆర్ జె రత్నాకర్, స్పోర్ట్స్ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి, నాగ నంద్, ప్రసాదరావు, నీ మిస్ పాండే, జాయింట్ కలెక్టర్ సిరి, ఎస్పీ పకీరప్ప, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి, ట్రస్ట్ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు, భజన బృందం తదితరులు పాల్గొన్నారు. అనంతరం పుట్టపర్తి విమానాశ్రయం ద్వారా భారతదేశప్రధాన న్యాయమూర్తి బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు.
addComments
Post a Comment