జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని డిసెంబర్ 21న ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభంకొవ్వూరు (ప్రజా అమరావతి);


జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని డిసెంబర్ 21న ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభంగ్రామ, వార్డు సచివాయాల్లోనే రిజిస్ట్రేషన్... 


ఆర్డీవో ఎస్.మల్లిబాబు..


కొవ్వూరు డివిజన్ పరిధిలో 3081 మంది లబ్దిదారులు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం కింద రూ. 291.61 లక్షలు చెల్లింపులు చెయ్యడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.


రాష్ట్ర ప్రభుత్వం పేద, నిరుపేద, మధ్య తరగతి వర్గాల కుటుంబాల కోసం జగనన్న గృహ హక్కు పధకం మరో చక్కటి పథకాన్ని ప్రవేశ పెట్టిందని ఆర్డీవో తెలిపారు.  ఈ పథకం కింద 1983 తర్వాత హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల ద్వారా ఇళ్ళు మంజురూ చేశారన్నారు. ఆ స్థలాలు, ఇళ్ళు పై సంపూర్ణ హక్కులు కల్పించే దిశగా వన్ టైం సెటిల్ మెంట్ చేసుకున్న లబ్ధిదారులకు డాక్యుమెంట్స్ ఇవ్వడంతో పాటు రిజిస్టర్ టైటిల్ ఇస్తామని పేర్కొన్నారు.  అమ్ముకోవాలన్నా, రుణాలు తెచ్చుకోవాలన్నా లబ్ధిదారులకు పూర్తి హక్కులు వస్తాయని తెలిపారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రయోజనాలు చాలా ఉన్నాయని, 

పట్టా తీసుకున్న వారు, ఇల్లు కట్టుకున్న వారు.. హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకున్న వారికి గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్‌లలో రూ.20వేలు చెల్లిస్తే ఈ పథకం వర్తిస్తుందని ఆయన తెలియచేసారు. ఆ లబ్ధిదారులకు ఎంత రుణం ఉన్నా.. వన్ టైం సెటిల్ మెంట్ కింద  మిగిలిన రుణం ఎంత ఉన్నా మాఫీ అవుతుందని మల్లిబాబు తెలిపారు. ఒకవేళ ఆమొత్తం ఇంకా తక్కువ ఉన్న యెడల అమొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుందన్నారు. విఆర్వో, ఇంజినీరింగ్ సహాయకులు వొచ్చి సర్వే కొలతలు తీసుకుని నిర్ధారణ చెయ్యడం జరుగుతుందన్నారు. లబ్దిదారులకు  డిసెంబర్ 21న సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జారీ చేస్తారని తెలిపారు. ఇది పూర్తిగా స్వచ్ఛంద పధకమని, ఓటీఎస్ వలన ప్రతి లబ్ధిదారునికి రిజిస్ట్రేషన్ కోసం, యూజర్ చార్జీల కోసం చేసే ఖర్చు ఆదా అవుతుందన్నారు. డివిజన్ పరిధిలోని కొవ్వూరు మండలం లో 386 మంది, తాళ్లపూడి లో 265 , నిడదవోలు లో 236 మంది లబ్దిదారులు చెల్లింపు చెయ్యడం జరిగిందన్నారు. పథకం యొక్క ప్రయోజనం ప్రజలకు వివరించి వారిలో అవగాహన కల్పించే దిశగా మండల, మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.