జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో 30 మంది సభ్యుల బృందం

 అమరావతి (ప్రజా అమరావతి);    దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ బృందం జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ  (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో 30 మంది సభ్యుల బృందం


జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొనుంది. జాతీయస్థాయి నైపుణ్య పోటీలకు ఈసారి కూడా ఢిల్లీ వేదిక కానుంది. జనవరి 6 నుంచి 10వ తేదీవరకు ఢిల్లీలోని ప్రగతిమైదాన్ లో జాతీయస్థాయి నైపుణ్య పోటీలు జరగనున్నాయి. మొత్తం 54 విభాగాల్లో 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 500మందికిపైగా అభ్యర్థులు పోటీలకు హాజరుకానున్నారు. మన రాష్ట్రం నుంచి యోగాతోపాటు మొత్తం 17 విభాగాల్లో 30 మంది జనవరి 6 నుంచి 10వ తేదీవరకు జరిగే జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొననున్నారు. 


ఇందులో ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో 16 విభాగాల్లో 20 మంది మొదటి, రెండు స్థానాలు సాధించినవారున్నారు. అంతేకాకుండా ఇటీవల జాతీయస్థాయి నైపుణ్యాభివృద్ధి సంస్థ డెమో స్కిల్స్ కేటగిరీలో నిర్వహించిన జాతీయస్థాయి యోగా పోటీల్లో మన రాష్ట్రం నుంచి నలుగురు ఎంపికయ్యారు. వీరితోపాటు మెరిట్ కోటాలో కొంతమందిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అలా మెరిట్ కోటాలో మన రాష్ట్రం నుంచి ఆరుగురు నైపుణ్య పోటీలకు అర్హత సాధించారు. దీంతో మన రాష్ట్రం నుంచి జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిథ్యం వహించే వారి సంఖ్య 30 మందికి పెరిగింది. వీరందరికీ ఇప్పటికే ఆయా ట్రేడ్స్ లో ప్రముఖ కంపెనీలు, సంస్థలకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇప్పించడం జరుగుతోంది. జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో సత్తా చాటి విజేతలుగా నిలిచినవారు.. మన దేశం తరుఫున 2022 అక్టోబర్ నెలలో చైనాలోని షాంఘై నగరంలో జరిగే ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కుతుంది. 


*జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో మన రాష్ట్రం తరుఫున పాల్గొంటున్న విభాగాలు:*


1) అడిటేటివ్ మ్యానుఫ్యాక్చురింగ్ – 2 (మెరిట్ కోటాలో 1)

2) ఆటోబాడీ రిపేర్ – 1

3) క్లౌడ్ కంప్యూటింగ్ – 1

4) కాంక్రీట్ కన్ స్ట్రక్షన్ వర్క్ – 2

5) సైబర్ సెక్యూరిటీ -2 

6) డిజిటల్ కన్ స్ట్రక్షన్ – 3 (మెరిట్ కోటాలో 2)

7) ఎలక్ట్రానిక్స్ – 1

8) ఐటి నెట్ వర్క్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ – 1

9) ఐటి సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ఫర్ బిజినెస్ – 1

10) మొబైల్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ – 2

11) మొబైల్ రొబోటిక్స్ – 2

12) ప్రింట్ మీడియా టెక్నాలజీ – 1 

13) రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ – 1

14) రిన్యూవబుల్ ఎనర్జీ – 1 (మెరిట్ కోటా)

15) వెల్డింగ్ – 1

16) రొబోట్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్  - 4 (మెరిట్ కోటాలో 2)

17) యోగా (డెమో స్కిల్స్) – 4