అన్నా ప్రమాదంలో గాయపడ్డాను... నిన్ను చూడాలని ఉంది.

 

సరస్వతి నగర్, తిరుపతి (ప్రజా అమరావతి);


*అన్నా ప్రమాదంలో గాయపడ్డాను... నిన్ను చూడాలని ఉంది.*
అన్నా రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాను .. నిన్ను చూడాలనుందన్నా అంటూ సరస్వతీనగర్‌కు చెందిన ఆర్‌ విజయకుమారి అనే మహిళ తన  కుమార్తె ద్వారా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు విన్నవించుకుంది. 


వరద ప్రాంతాల పర్యటలో భాగంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలో సరస్వతి నగర్ వచ్చిన శ్రీ వైయస్‌.జగన్‌కు తన తల్లి విజయ కుమారి కోరికను కుమార్తె వైష్టవి  తెలియజేసింది. 


దీంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంకా కోలుకోని ఆర్‌ విజయకుమారిని స్వయంగా ఇంట్లోకి వెళ్లి పరామర్శించిన సీఎం 

ఆమెకు ప్రమాదం జరిగిన తీరును, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.  త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.   


సీఎం శ్రీ వైయస్ జగన్ నేరుగా తమ ఇంటికి వచ్చి పరామర్శించడంపై  విజయకుమారి, ఆమె భర్త గజేంద్ర, కుమార్తె వైష్ణవి హర్షం వ్యక్తం చేశారు.