ధన్వంతరీ హోమం మరియు ఆయుష్ హోమము:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి):
ధన్వంతరి జయంతి ని పురస్కరించుకుని లోకసంరక్షణార్థం మరియు కోవిడ్ -19 పూర్తిగా నిర్మూలింపబడి ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని సంకల్పించి, ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఉదయం 09.30 గం.లకు దేవస్థానం నందు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు మరియు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ధన్వంతరీ హోమము మరియు ఆయుష్ హోమము దేవస్థానం వారిచే నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమము నందు ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు, పాలకమండలి సభ్యురాలు శ్రీమతి కత్తిక రాజ్యలక్ష్మి గారు, శ్రీమతి కటకం శ్రీదేవి గారు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం నందు ఆలయ ప్రధానార్చకులు శ్రీ లింగంభొట్ల దుర్గాప్రసాద్ గారు, ఆర్.శ్రీనివాస శాస్త్రి గారు, అర్చక సిబ్బంది, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి వార్లు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నందు భక్తులు విశేషముగా పాల్గొన్నారు..
addComments
Post a Comment