పరిశ్రమల శాఖ సంచాలకుల కార్యాలయం మంగళగిరికి తరలింపు

 

పరిశ్రమల శాఖ సంచాలకుల కార్యాలయం మంగళగిరికి తరలింపు

పరిశ్రమల శాఖ అదనపు సంచాలకులు బి.గోపాలకృష్ణ

అమరావతి, డిశంబరు 17 (ప్రజా అమరావతి):  రాష్ట్ర పరిశ్రమల శాఖ సంచాలకుల కార్యాలయాన్ని మంగళగిరి ఏ.పి.ఐ.ఐ.సి.భవనంలోకి తరలించినట్లు ఆశాఖ అదనపు సంచాలకులు బి.గోపాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ముత్యాలంపాడులోని ప్రింటింగ్ ప్రెస్ భవనంలో పనిచేసే తమ కార్యాలయాన్ని గుంటూరు జిల్లా మంగళగిరిలోకి ఏ.పి.ఐ.ఐ.సి.భవనం 8 వ అంతస్తులోకి గత మాసంలోనే తరలించడం జరిగిందని, గత  నెల 22 వ తేదీ నుండి తమ కార్యాలయం అక్కడే పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ కార్యాలయం తరలింపు  విషయాన్ని పరిశ్రమల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. 


Comments