ప్రజా ప్రతినిధులు అధికారులు కోఆర్డినేషన్ చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమం, అభివృద్ధి పనులను చేసుకోవాలన్నారు

 కొల్లిపర (ప్రజా అమరావతి); కొల్లిపర మండలానికి సంబంధించి కొల్లిపర గ్రామ పంచాయతీ, ఎంపీపీ, సచివాలయం 1 2 3 లకు సంబంధించి రివ్యూ మీటింగ్ సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేక అతిథిగా పాల్గొని రివ్యూ మీటింగ్ గురించి తెలిపారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రజా ప్రతినిధులు అధికారులు కోఆర్డినేషన్ చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమం, అభివృద్ధి పనులను చేసుకోవాలన్నారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు కొత్తగా ఎన్నుకోబదిన ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు బాధ్యతతో పనిచేయాలన్నారు.  పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులు,14,15త్ ఫైనాన్స్ నిధులు ఎక్కడెక్కడ వాడుకోవాలో ఆ గ్రామ వార్డు ఏరియా లో ఉన్న నెంబర్స్, ఎంపీటీసీలు, అధికారులు అందరూ కోఆర్డినేషన్ చేసుకుని  ఎలా ఉపయోగించాలనేది సమీక్షించుకోవాలని గ్రామానికి సంబంధించి పారిశుద్ధ్యం, సిసి రోడ్లు నిర్మించి అభివృద్ధి పథంలో నడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి. శ్రీనివాసులు, ఎమ్మార్వో జి. నాంచారయ్య, ఎంపీపీ భీమవరపు. పద్మావతి సంజీవరెడ్డి, సర్పంచ్ పిల్లి. రాధిక, ఉప సర్పంచ్ అవుతు. కృష్ణారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు భీమవరపు. శివ కోట రెడ్డి, పంచాయతీ వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది మరియు అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.