కల్వర్టు నిర్మాణానికి సర్పంచ్ భూమిపూజ

 *కల్వర్టు నిర్మాణానికి సర్పంచ్ భూమిపూజ*ఉరవకొండ (ప్రజా అమరావతి):

పట్టణంలోని 10 వ వార్డు రంగావీధిలో ప్రదాన రహదారిపై ఉన్న డ్రైనేజీ మీద నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టుకు సర్పంచ్ మీనుగా లలిత, వార్డు సభ్యుడు నిరంజన్ గౌడ్, నాయకులు బసవరాజు తదితరులు భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే రహదారి డ్రైనేజీపై ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రజలు, స్కూలు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దింతో శనివారం దీని నిర్మాణం పనులను చేపట్టారు.ఈసందర్భంగా బసవరాజు తదితరులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సహకారంతో ఉరవకొండ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్ వర్క్ ఇన్స్పెక్టర్ శివ, వైస్సార్సీపీ నాయకులు మిరన్ బాషా, అన్వర్, జబ్బర్, హస్సేన్, దావుద్, శంకర ముకుంద, జగన్నాథ్, డీకే సత్యనారాయణ, వేల్పుల నాగరాజు, సాయి కిరణ్, శ్రీరాములు, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.