జిల్లా పరిషత్ ఏడు స్థాయి సంఘ సమావేశాల కొరకు ఛైర్మన్ మరియు సభ్యుల ఎన్నికచిత్తూరు, డిసెంబర్ 12 (ప్రజా అమరావతి): జిల్లా పరిషత్ ఏడు స్థాయి సంఘ సమావేశాల కొరకు ఛైర్మన్ మరియు సభ్యుల ఎన్నిక


ఆదివారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్మన్ వి.గోవిందప్ప శ్రీనివాసులు ఆద్వర్యంలో జరిగింది. ఒకటవ, రెండవ, నాల్గవ, ఏడవ స్థాయి సంఘాలైన ఆర్ధిక స్థాయి, గ్రామీణాభివృద్ది, విద్య మరియు వైద్య సేవలు, పనుల స్థాయి సంఘాలకు జడ్పీ ఛైర్మన్ అధ్యక్షులుగాను, మూడవ స్థాయి సంఘమైన వ్యవసాయ సంఘానికి జడ్పీ ఉపాధ్యక్షులు బి.ధనంజయులు రెడ్డి అధ్యక్షులుగాను, ఐదవ స్థాయి సంఘం అయిన స్త్రీ సంక్షేమ సంఘానికి తవనంపల్లి జడ్పీ టిసి సభ్యులు సి.ఆర్.భారతి అధ్యక్షులుగాను, ఆరవ స్థాయి సంఘమైన సాంఘిక సంక్షేమ సంఘానికి జడ్పీ ఉపాధ్యక్షులు ఆర్.రమ్య అధ్యక్షులుగా ఎన్నిక అయినట్లు జడ్పీ ఛైర్మన్ ప్రకటించారు. మొదటి సంఘంలో 14 మంది, రెండవ సంఘంలో 12 మంది, మూడవ సంఘంలో 10 మంది, నాల్గవ సంఘంలో 11 మంది, ఐదవ సంఘంలో 11 మంది, ఆరవ సంఘంలో 10 మంది, ఏడవ సంఘంలో 15 మంది సభ్యులుగా ఉన్నట్లు వారి పేర్లను ప్రకటించారు.