శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:

 శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:


(ప్రజా అమరావతి)  

  ఈరోజు అనగా ది. 27-12-2021(మూడవ రోజున) ఉదయం 03.00 గం.ల నుండి రాత్రి వరకు భవానీ భక్తులు మరియు సామాన్య భక్తులు కలిపి సుమారు 50 వేల మంది శ్రీ అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా వేయడమైనది.


* భవానీ దీక్ష విరమణల సందర్భముగా )  ది.30-12-2021 వరకు దేవస్థానము నందు నిర్వహించు అన్ని ఆర్జిత సేవలు దేవస్థానము తరుపున మాత్రమే నిర్వహించడము జరుగుచున్నది. భక్తుల సౌకర్యార్థము భక్తుల యొక్క గోత్ర నామములపై పూజ జరిపించుకోనుటకు(పరోక్షముగా మాత్రమే) గాను దేవస్థానము వారు అన్ని ఆర్జిత సేవలు పరోక్ష  సేవలుగా నిర్వహించుచూ,   www.aptemples.ap.gov.in ద్వారా అందుబాటులో ఉంచటము జరిగినది. పూజ జరిగిన అనంతరం సదరు సేవ యొక్క ప్రసాదములు భక్తులకు పోస్ట్ ద్వారా భక్తుల అడ్రెస్స్ కు పంపడము జరుగునని కార్యనిర్వహణాధికారి వారు ఒక ప్రకటనలో తెలిపారు.