*'ఓటీఎస్ సర్వే వంద శాతం పూర్తి చేయండి'*
*'పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీల నిర్మాణాలను వేగవంతం చేయండి'*
*'చెత్త నుండి సంపద కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలి'*
*'చిరు వ్యాపారులకు తోడు అందించండి'*
*అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి*
అనంతపురము, డిసెంబరు 06 (ప్రజా అమరావతి);
ఓటీఎస్ సర్వే వందశాతం పూర్తి చేసి, పెద్ద ఎత్తున లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఫలాలు దక్కేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఓటీఎస్ సర్వే ద్వారా లబ్ధిదారులందరినీ గుర్తించడం ద్వారానే వారికి పథకం ఫలాలు అందించగలమన్నారు. ఓటీఎస్ పనులతో పాటూ నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. కోర్టు తీర్పు ఇళ్ల నిర్మాణాలకు సానుకూలంగా వచ్చిందని, తిరిగి నిలిచిపోయిన కాలనీల నిర్మాణ పనులను పున:ప్రారంభించాలన్నారు.
సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ ఆర్డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, మరియు ఎంపీడీవోలతో స్పందన సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఓటీఎస్, పేదలందరికీ ఇళ్లు పథకాలతో పాటూ జగనన్న స్వచ్ఛ సంకల్పం, జగనన్న తోడు, అర్బన్ హెల్త్ క్లినిక్కుల నిర్మాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వర్మీ కంపోస్టింగ్ తో పాటూ గ్రామాల్లోని చెత్తను పూర్తి స్థాయిలో సంపద తయారీ కేంద్రాల వద్ద ప్రాసెసింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంపద తయారీ కేంద్రాలు లేని గ్రామాల్లో సైతం సైతం వాటిని నిర్మించాలని, నిర్మాణానికి స్థల సమస్యలుంటే పరిష్కరించాలని ఆర్డీవోలను ఆదేశించారు.
గ్రామాల్లో పారిశుద్ధ్యం కోసం గ్రీన్ గార్డ్స్, స్వచ్ఛ మిత్రలను నియమించుకుని ఉదయం 5 గంటల నుంచే చెత్త సేకరణ ప్రారంభించాలన్నారు. గ్రీన్ గార్డ్స్ అటెండెన్స్ యాప్ లో వంద శాతం అటెండెన్స్ ఉండాలన్నారు.
జగనన్న తోడు యాప్ ప్రతి వాలంటీరు చేత ఇంస్టాల్ చేయించాలని, పాత దరఖాస్తులను రెన్యూవల్ చేయడంతో పాటు కొత్త వ్యాపారుల దరఖాస్తులను అప్ లోడ్ చేయాలన్నారు. తోడు పథకం ఆర్థిక సహాయం అందించే పథకంగా చిరు వ్యాపారులు భావిస్తున్నారని, వారికి తోడు పథకం తక్కువ వడ్డీకి మైక్రో రుణం అందించే పథకం అనే విషయంపై అవగాహన కల్పించి రుణాలు తిరిగి చెల్లించేలా ప్రోత్సహించాలన్నారు. ఇప్పటి వరకూ రుణాల కంతులు చెల్లించనివారు సైతం లోన్ రెన్యూవల్ చేసుకునే అవకాశాలను, రెన్యూవల్ చేసుకోవడం వల్ల లాభాలను వివరించాలన్నారు. అర్బన్ హెల్త్ క్లినిక్కుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని మునిసిపల్ కమిషనర్లను అదేషించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు ఏ.సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్, సీపీవో ప్రేమ్ చంద్, హౌసింగ్ పీడీ కేశవ నాయుడు, జెడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఈ భాగ్య రాజ్, ఆర్డబ్ల్యుఎస్ ఎస్.ఈ వెంకట రమణ, ఐసీడీఎస్ పీడీ సుజన, ఆర్డీవోలు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment