వార్డు స్థాయిలో ప్రత్యేక కమిటీ లు ఏర్పాటు చెయ్యాలి.

 


కొవ్వూరు  (ప్రజా అమరావతి);


వార్డు స్థాయిలో ప్రత్యేక కమిటీ లు ఏర్పాటు చెయ్యాలి.వ్యాక్సినేషన్ 100% పూర్తి చెయ్యాలి .... ఆర్డీవో మల్లిబాబు


కోవిడ్ లక్షణాలతో ఉండే బాధితుల వివరాలు పకడ్బందీగా సేకరించాలని, ఇందుకోసం  స్థానిక ప్రజాప్రతినిధులతో  సమన్వయం చేసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు.


బుధవారం ఆర్డీవో కార్యాలయంలో కొవ్వూరు పట్టణంలోని వార్డు కార్యదర్సులు, మెడికల్ సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, కొవ్వూరు పట్టణంలో కోవిడ్ వ్యాక్సినేషన్ 100 శాతం లక్ష్యాలను సాధించేందుకు వార్డు స్థాయి లో మునిసిపల్ సిబ్బంది, వాలంటీర్, మెడికల్, ఆశా వర్కర్, ఔత్సాహికులతో కూడిన బృందలను ఏర్పాటు చేసుకుని ఇంటింటి సర్వే చేపట్టాలని ఆదేశించారు. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారి  వివరాలు ఎప్పటికప్పుడు గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో మునిసిపల్ కమీషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రెండవ డోసు వేసుకోవాల్సిన వారి డేటా ఎంట్రీ పూర్తి చేయాలని పేర్కొన్నారు.  కోవిడ్ 2వ డోసు వ్యాక్సినేషన్ వేసుకొని వారి వివరాలను ఇంతకు ముందు తొలి డోసు వారి ఫోన్ నెంబర్ ద్వారా ధ్రువీకరణ చేసుకోవాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు తో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  సమన్వయం తో కొన్నిసార్లు సమస్యలను తక్షణమే పరిష్కరించడం సాధ్యం అవుతుందన్నారు. ప్రస్తుతం కొవ్వూరు లో 35 వ ఫీవర్ సర్వే చేపడుతున్నామని, సమగ్ర డేటా సేకరించి, డేటా నమోదు లో ఆశా కార్యకర్తల, ఆరోగ్య కార్యకర్తలు సరిపోరని వారికి వార్డు సచివాలయంలో పనిచేసే డి ఈ ఓ ల డేటా వర్కు పూర్తి చేసేందుకు మెడికల్ అధికారులకు అందుబాటులో ఉంచాలని మల్లిబాబు  తెలిపారు. 15-18 ఏళ్ల వారికి తదుపరి ఫేజ్ లో జనవరి 3 వ తేదీ తర్వాత వ్యాక్సినేషన్ అందించాల్సి ఉందన్నారు. కాలేజిల్లో చదివే వారితో పాటు, ముఖ్యంగా  అసంఘటిత రంగంలో ఉన్న యువత పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు.  ఫ్రైడే ను డ్రై డే గా  ఖచ్చితత్వం తో చేపట్టాలని, శానిటేషన్ పై వార్డుల స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని సూచించారు. 


వ్యాక్సిన్ వేసుకున్న వారు సంబంధించిన ధ్రువీకరణ పత్రం కోసం 9013151515 నెంబర్ ను భారత ప్రభుత్వం అందుబాటులో తీసుకుని వొచ్చిందని ఆర్డీవో మల్లిబాబు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న సందర్భంలో ఇచ్చిన ఫోన్ నందు ఈ నెంబర్ సేవ్ చేసుకుని, వాట్సాప్ ద్వారా certificate అని టైపు చేసి 9023151515 నెంబర్ కి సందేశం పంపితే వెంటనే వ్యాక్సిన్ సర్టిఫికెట్ వొస్తోందని తెలిపారు.


ఈ సమావేశంలో మెడికల్ అధికారులు డా.కె.సత్యవతి, డా.సీహెచ్. రాజీవ్, ఆరోగ్య సూపర్వైజర్ వి.శ్రీనివాస్, ఏ.ఎన్. ఎమ్. లు, వార్డు సచివాలయ కార్యదర్సులు పాల్గొన్నారు.