*"సర్వేపల్లి ఆసుపత్రులకు మహర్దశ" - కాకాణి
.*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
పొదలకూరు, వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రాలకు "ఇన్ కోవిడ్ సపోర్ట్" స్వచ్ఛంద సంస్థ, 70 లక్షల రూపాయల ఆస్పత్రి పరికరాలు, సామాగ్రి అందజేయనున్నట్లు వెల్లడి.
వెంకటాచలం మండల పరిషత్ అధ్యక్షురాలిగా శ్రీమతి మందా కవిత బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని, నూతనంగా ఎంపికైన యంపీటీసీలను సన్మానించిన ఎమ్మెల్యే కాకాణి.
రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా ఎరువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.
నూతనంగా నియమితులైన వాలంటీర్లకు సెల్ ఫోన్ల పంపిణీ.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు వైద్యం అందించడానికి అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో పాటు, 108, 104 సేవలను పునరుద్ధరించారు.
జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తున్న వైద్యసేవలకు తోడుగా అనేక స్వచ్చంద సేవ సంస్థలు ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం.
*"ఇన్ కోవిడ్ సపోర్ట్"* స్వచ్ఛంద సేవ సంస్థ 70 లక్షల మేర పొదలకూరు, వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రాలకు వైద్య పరికరాలు అందించడానికి ముందుకు రావడం సంతోషకరం.
*"ఇన్ కోవిడ్ సపోర్ట్"* స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 70 లక్షల రూపాయల వైద్య పరికరాలు అందించడానికి విశేషంగా కృషిచేసిన వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అధినేత వసంతలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించడానికి నాతోపాటు నూతనంగా ఎంపికైన మండల పరిషత్తుల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జెడ్పిటిసి సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వార్డు మెంబర్లు అందరం కలిసి కట్టుగా పని చేద్దాం.
రైతాంగానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయడంతో పాటు, సరసమైన ధరలకు ఎరువులు కూడా సరఫరా చేస్తున్నాం.
రైతాంగానికి అన్నివిధాలా అండగా నిలిచి, పంటలు సమృద్ధిగా పండించుకొని గిట్టుబాటు ధర కల్పించేంత వరకు అందుబాటులో ఉండి, అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.
సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో రెండు సార్లు శాసనసభ్యునిగా అవకాశం కల్పించిన వారి రుణం తీర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తా.
addComments
Post a Comment