సజ్జల మాటల్లో భయం కనిపిస్తోంది: బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు

 *సజ్జల మాటల్లో భయం కనిపిస్తోంది: బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు


*


న్యూ ఢిల్లీ (ప్రజా అమరావతి) : ఏపీలో వైసీపీ పతనం ప్రారంభమైందనడానికి ప్రజా ఆగ్రహ సభ విజయవంతం కావడమే నిదర్శనమని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై జాలిగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సజ్జల మాటల్లో భయం స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఎవరో మాట్లాడిస్తే మాట్లాడాల్సిన దుస్ధితి బీజేపీ కి లేదన్నారు. ఏపీపై బీజేపీ ఫోకస్‌ పెడితే వైసీపీ నేతల అడ్రస్‌లు గల్లంతవుతాయని తెలిసే జాలి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా నరేంద్రమోదీ పాలన సుపరిపాలనకు అద్దం పడితే, జగన్‌ పాలన సుపరిపాలనకు అడ్డంగా మారిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ స్వార్థ రాజకీయాలే నని విమర్శించారు. ప్రజలు విసిగి వేసారిపోయారని, వైసీపీ పతనం మొదలైందని  జీవీఎల్ అన్నారు.