కార్బన్ ఉద్గారాల కట్టడికి తీసుకుంటున్న చర్యలేమిటి?

 కార్బన్ ఉద్గారాల కట్టడికి తీసుకుంటున్న చర్యలేమిటి?

రాజ్యసభ ప్రశ్నోత్తరాలలో శ్రీ వి. విజయసాయి రెడ్డి ప్రశ్న

న్యూఢిల్లీ, డిసెంబర్ 9 (ప్రజా అమరావతి): ప్రపంచవ్యాప్తంగా భవన నిర్మాణ పనుల నుంచి 39% కార్బన్‌ ఉద్గారాలు వెలువడుతుండగా అందులో 28% భవనాల నిర్వహణకు వాడే ఇంధనం కారణమవుతోంది. భవన నిర్మాణ, నిర్వహణతోపాటు వాటి అనుబంధ కార్యకలాపాల వలన వెలువడే కార్బన్‌ ఉద్గారాల నియంత్రణకు ప్రణాళిక దశ నుంచే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో వివరించాలని గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి పర్యావరణ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్‌ను ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ దీనిపై పర్యావరణ మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉందని చెప్పారు. నగరాల్లో పెద్ద ఎత్తున నిర్మాణ కార్యకలాపాలు చేపడుతున్నందు వలన సమస్య తీవ్ర రూపం దాలుస్తున్నందున ఈ నిర్మాణాలను నియంత్రించే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.

Comments