నెల్లూరు, (prajaamaravati);
జిల్లాలో మంజూరైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియ పనులను సత్వరమే పూర్తి చేయాలని
జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్ చక్రధర్ బాబు, సంబందిత రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు.
గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని శంకరన్ హాల్లో జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారులు, ఆర్. అండ్ బి రహదారుల విస్తరణ పనులకు, రైల్వే, ఎ .పి.ఐ.ఐ.సి, తదితర ప్రొజెక్ట్స్ కు సంబందించి చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియ పై జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, రెవెన్యూ సంయుక్త కలెక్టర్ శ్రీ హరేందిర ప్రసాద్ తో కలిసి రెవెన్యూ అధికారులతో, సంబందిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను, జాతీయ రహదారులు, ఎ.పి.ఐ.ఐ.సి, తదితర ప్రాజెక్టుల కోసం అవసరమైన భూముల సేకరణ పై ప్రత్యేక దృష్టి సారించి భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. నాయుడుపేట , శ్రీకాళహస్తి జాతీయ రహదారి ప్రాధాన్యతను దృష్టిలో వుంచుకొని భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, నాయుడుపేట రెవెన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు. భూ సంబంధిత పనులు, రోడ్ల అభివృద్ది పురోగతి, దీర్ఝకాలంగా పెండింగ్ లో వున్న వివిధ ప్రాజెక్ట్స్ కు సంబందించిన భూసేకరణ పనులను ఈ నెల 15వ తేదీ లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డి ఆర్ ఓ చిన్న ఓబులేసు, డి.ఎఫ్.ఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ శ్రీ నాగేశ్వర రావు, నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేట, ఆత్మకూరు ఆర్ డి వో లు శ్రీ హుస్సేన్ సాహెబ్, శ్రీ సీనా నాయక్, శ్రీ మురళి కృష్ణ , శ్రీమతి సరోజిని, చైత్ర వర్షిని, ఎ.పి.ఐ.ఐ.సి, ఆర్.అండ్ బి. మత్స్య శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment