డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గదర్శకాల వల్లే నేడు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్


 

 చిత్తూరు డిసెంబర్ 6 (ప్రజా అమరావతి): డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గదర్శకాల వల్లే నేడు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 65వ వర్థంతి సందర్భంగా చిత్తూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ లో గల ఆయన విగ్రహానికి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరగాలని అంబేద్కర్ ఆశయాలను అమలు చేయడం వల్లనే ప్రస్తుతం అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతోందన్నారు.రాజ్యాంగ నిర్మాణానికి ఎనలేని కృషి చేశారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ జి. శ్రీనివాసులు మాట్లాడుతూ  మహాత్మా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పూర్తిగా అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరుగుతొందని,  ఆయన చూపిన మార్గదర్శకాలలో నడుచుకోవాలని అన్నారు. చిత్తూరు శాసన సభ్యులు అరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గాల్లో అందరికీ న్యాయం జరుగుతొందని ఆయన చూపిన మార్గదర్శకాలు మనకు స్పూర్తిదాయకం,రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిధంగా పరిపాలన చేస్తూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో పాటు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే శ్రీనివాసులు, చిత్తూరు మేయర్ ఆముద, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్( ఆసరా) రాజశేఖర్ తదితరులు అంబేద్కర్ కు నివాళులు అర్పించారు.

Comments