.
అమరావతి (ప్రజా అమరావతి);
- వైయస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్దం
- జనవరి నుంచి రూ.2500కి పెన్షన్ పెంపుదల
- 5 రోజుల పాటు పండుగలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
- జనవరి 1న ప్రత్తిపాడులో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం
- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61.75 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్
- ఇందుకోసం రూ.1570.60 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
- జనవరి నెలలో కొత్తగా 1.41 లక్షల మందికి పెన్షన్లు మంజూరు
: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
జనవరి ఒకటో తేదీ నుంచి అయిదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి నెల నుంచి లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాలను రూ.2250 నుంచి రూ.2500 రూపాయలకు పెంచి చెల్లించబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సీఎం శ్రీ వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని, జనవరి 1వ తేదీన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం శ్రీ వైయస్ జగన్ గారు స్వయంగా పాల్గొని పంపిణీని ప్రారంభిస్తారని తెలిపారు.
వైయస్ఆర్సిపి అధికారంలోకి వస్తే అవ్వాతాతలకు చెల్లిస్తున్న పెన్షన్ మొత్తాలను పెంచుతామని శ్రీ వైయస్ జగన్ గారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. దాని ప్రకారం సీఎంగా శ్రీ వైయస్ జగన్ గారు అధికారం చేపట్టిన తొలిరోజే తొలి సంతకం పెన్షన్ల పెంపుదలపైన చేశారని గుర్తు చేశారు. పెన్షన్ల మొత్తాన్ని రూ.3వేల వరకు పెంచుతామన్న మాటకు కట్టుబడి పింఛన్ మొత్తాలను పెంచుతున్నారు. 5 రోజుల పాటు రాష్ట్రంలో ఒక పండుగలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గుంటూరుజిల్లా ప్రత్తిపాడులో జరిగే కార్యక్రమంలో సీఎం శ్రీ వైయస్ జగన్ పాల్గొని పెన్షన్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అలాగే అన్ని జిల్లాల్లోనూ ఇన్చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ పెన్షన్ల పంపిణీలో భాగస్వాములు అవుతారు.
జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61.75 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.1570.60 కోట్ల రూపాయలను విడుదల చేసింది. జనవరి నెలలో కొత్తగా 1.41 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీరికి కూడా నెల ఒకటో తేదీ నుంచి పెంచిన మొత్తాలతో పెన్షన్ చెల్లింపులు చేస్తాం. దేశంలోనే సామాజిక పెన్షన్ల కింద లబ్దిదారులకు ఎక్కువ మొత్తాలను చెల్లిస్తున్నది మన రాష్ట్రమే. ప్రతినెలా సుమారు 61 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నాం. - ఇందుకు ప్రతినెలా సుమారు రూ.1450 కోట్లుకు పైగా పెన్షన్ల కోసం కేటాయిస్తున్నాం. ప్రతి ఏటా దాదాపు రూ.18వేల కోట్ల మేరకు పెన్షన్ల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. జనవరి నుంచి పెరిగిన పెన్షన్లతో ప్రతిఏటా పెన్షన్ల కోసం చేసే ఖర్చు రూ.20వేల కోట్లకు చేరుతుంది. శ్రీ వైయస్ జగన్ సీఎంగా అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు పెన్షన్ల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం దాదాపు రూ.45వేల కోట్లు. మొత్తం 24 కేటగిరిల కింద పెన్షన్లను ప్రతినెలా 1వ తేదీనే లబ్ధిదారుల చేతికే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 2.66 లక్షల మంది వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా నెల ఒకటో తేదీనే నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి, వారి చేతికే పెన్షన్ సొమ్మును అందిస్తున్న ప్రక్రియ లేదు.
- దీర్ఘకాలిక వ్యాధులు, గుర్తించిన ఆనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కూడా మెడికల్ పెన్షన్లను అందిస్తున్నాం.
- రూ. 3000 కేటగిరిలో పెన్షన్ అందుకునే లబ్ధిదారులు : 7,46,633
- రూ.5000 కేటగిరిలో పెన్షన్ అందుకునే లబ్ధిదారులు : 29,932
- రూ.10 వేల కేటగిరిలో పెన్షన్ అందుకునే లబ్ధిదారులు : 13,750
- అభయహస్తం కింద రూ.500 పెన్షన్ అందుకునే లబ్ధిదారులు : 1,43,560
- రూ.2500 కేటగిరిలో పెన్షన్ అందుకునే లబ్ధిదారులు : 52,40,718
- సీఎం శ్రీ వైయస్ జగన్ గారు అధికారం చేపట్టిన తరువాత ఇప్పటి వరకు కొత్తగా ఇచ్చిన పెన్షన్లు : 18.36 లక్షలు. చంద్రబాబు ప్రభుత్వం హయాలో కేవలం 39 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చింది. అందుకోసం వారు ఖర్చు చేసింది కూడా నెలకు కేవలం రూ.400 కోట్లు మాత్రమే. కానీ సీఎం శ్రీ వైయస్ జగన్ గారు సామాజిక పెన్షన్ల విషయంలో మానవత్వంతో అవ్వాతాతలకు అండగా నిలుస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. జన్మభూమి కమిటీల ముందు పెన్షన్ల కోసం సాగిల పడాల్సిన దుస్థితిని అవ్వాతాతలకు తప్పించారు. అర్హతే ప్రామాణికంగా పెన్షన్ల జారీకి అత్యంత పారదర్శక విధానంను అమలులోకి తీసుకువచ్చారు. కాలు చేయి కదపడానికే ఇబ్బంది పడే వృద్ధుల ఇంటి ముంగిటకే, తెల్లవారుజామునే తలుపుతట్టి, చేతికే పెన్షన్ అందించే గొప్ప మార్పును ప్రవేశ పెట్టారు. సంక్షేమం పట్ల మనస్సున్న నాయకుడిగా శ్రీ వైయస్ జగన్ నిర్ణయాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
addComments
Post a Comment