నెల్లూరు, డిసెంబర్ 6 (ప్రజా అమరావతి):--జిల్లాలో పెండింగ్లో ఉన్న స్పందన అర్జీ లన్నిటిని వారంలోగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 132 గడువు దాటిన అర్జీలు పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిలో ప్రధానంగా మున్సిపల్ పరిపాలన శాఖ లో 41, సి సి ఎల్ ఏలో 20, పోలీస్ శాఖలో 17 అర్జీలు ఉన్నాయన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గత నెల రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా అధికారులందరూ సహాయక కార్యక్రమాలలో నిమగ్నం కావడం జరిగిందన్నారు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులు అన్నిటిని ఒక వారం లోగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే స్పందన అర్జీలు పరిష్కరించినప్పటికీ మరల అవే అంశాలపై 1522 మరలా వచ్చిన అర్జీలు పెండింగ్లో ఉండగా అందులో అత్యధికంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 671 అర్జీలు ఉన్నాయన్నారు. అలాగే డి ఆర్ డి ఏ పరిధిలో 265 అర్జీలు, రెవెన్యూ సిసిఎల్ఎ పరిధిలో 205 అర్జీలు పెండింగ్లో ఉన్నాయన్నారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన పరిష్కారం చాలా ముఖ్యమని ఆ దిశగా సంబంధిత జిల్లా అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం జరిగేలాగా చర్యలు చేపట్టాలన్నారు.
104 వైద్య సేవల్లో జిల్లాకు ఆవార్డు:
ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో అరబిందో ఎమర్జెన్సీ సర్వీసెస్ వారు జిల్లాలోని 104 సంచార వాహనం ద్వారా అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో జిల్లా ప్రధమ స్థానంలో నిలిచి అవార్డు దక్కంచుకోవడంతో జిల్లా కలెక్టర్ డీఎంహెచ్వో డాక్టర్ రాజ్యలక్ష్మిని, 104 జిల్లా మేనేజర్ పవన్ కుమార్ ను, ఏ డి ఎం వెంకట్రెడ్డి ని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 44 సంచార వైద్య క్లినిక్ ల ద్వారా 1144 సర్వీస్ పాయింట్లలో 6,49,467 మంది ప్రజలకు గత సంవత్సరం జులై నుండి ఈ సంవత్సరం నవంబరు మాసం వరకు 2,00,070 వైద్య పరీక్షలు చేసి జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
సైనిక సంక్షేమ నిధికి విరాళం:
సైనిక పతాక దినోత్సవం పురస్కరించుకొని డి ఆర్ డి ఎ పి డి శ్రీ సాంబశివా రెడ్డి సైనిక సంక్షేమ నిధి కోసం విరాళంగా 17 వేల రూపాయలు బ్యాంకు చెక్కును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సైనిక జిల్లా సైనిక సంక్షేమ అధికారి శ్రీ రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా డి ఆర్ డి ఎ పి డి ని జిల్లా కలెక్టర్ అభినందించారు.
గిరిజనులకు మొబైల్ ఆధార్ కార్డులు:
ఆధార్ కార్డు లేక చాలా మంది గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కోవడం దృష్టిలో ఉంచుకొని వారి ఇబ్బందులను తొలగించేందుకు కోసం జిల్లాలోని ఒక్కో డివిజన్కు ఒక సంచార ఆధార్ కిట్టు చొప్పున ఐదు డివిజన్లకు 5 కిట్స్ జిల్లాకు చేరుకోగా వాటిని జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించి వాటి ద్వారా ఆధార్ కార్డులు ముద్రింపచేయించి ఆధార్ కార్డులు గిరిజనులకు ఉచితంగా అందజేశారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ లు (రెవిన్యూ) శ్రీ హరెందిర ప్రసాద్, (అభివృద్ధి )శ్రీ గణేష్ కుమార్, (గృహ నిర్మాణం) శ్రీ విధేహ్ ఖరే, (ఆసరా) శ్రీమతి రోజ్ మాండ్, డి ఆర్ ఓ చిన్న ఓబులేసు, కె ఆర్ ఆర్సి ఎస్ డి సి శ్రీ దాసు, జెడ్ పి సీఈవో శ్రీనివాస రావు, డి పి ఓ శ్రీమతి ధనలక్ష్మి, డ్వామా పి డి తిరుపతయ్య, డి.ఎస్.ఒ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్, జలవనరుల శాఖ,విద్యుత్ శాఖ ఎస్. ఈ. లు శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ కృష్ణ మోహన్, శ్రీ విజయ కుమార్ రెడ్డి, డి ఈ ఓ శ్రీ రమేష్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment