నడవడానికి ఇబ్బంది పడుతున్న కుసుమ పరిస్థితి చూసి తానే స్వయంగా వాళ్ళ ఇంటిలోనికి వెళ్లిన సీఎం.

 

సరస్వతి నగర్, తిరుపతి (ప్రజా అమరావతి);


*వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో తిరుపతి కార్పొరేషన్ సరస్వతి నగర్ లో సీఎం శ్రీ వైయస్ జగన్ ను కలిసిన కిడ్నీ పేషెంట్ బి కుసుమ కుటుంబ సభ్యులు*


*నడవడానికి ఇబ్బంది పడుతున్న కుసుమ పరిస్థితి చూసి తానే స్వయంగా వాళ్ళ ఇంటిలోనికి వెళ్లిన సీఎం.*



*కుసుమ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసిన ముఖ్యమంత్రి.*


*కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ఇచ్చే ఫించను అందుతుందా? లేదా? అని వివరాలు తెలుసుకున్న సీఎం*


*తనకు ప్రతినెలా పించను అందుతోందని తెలిపిన కుసుమ భర్త చంద్రశేఖర్.* 


 తన భార్యకు ఊపిరి తిత్తులులో నీరు చేరడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని .. ముఖ్యమంత్రి కి తమ కష్టాలు చెప్పుకున్న కుసుమ కుటుంబ సభ్యులు. 

  

కుసుమ వైద్య ఖర్చులకు తగిన ఆర్థిక సాయానికి భరోసా ఇచ్చిన సీఎం శ్రీ వైయస్ జగన్ 


వారి కుటుంబానికి తగిన సాయం చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్

Comments