న్యాయవ్యవస్థ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపచేసేలా న్యాయవాదులు కృషి చేయాలి
• ప్రజా సమస్యలు,హక్కులు పరిరక్షణలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించాలి
• సమాజానికి న్యాయవాదులు మార్గదర్శకులుగా నిలవాలి
• సమాజ శ్రేయస్సుకై న్యాయవాదుల సేవలను పూర్తిగా అందించాలి
• రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తులు సహా ఇతర ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ
అమరావతి,26 డిశంబరు (ప్రజా అమరావతి):భారత దేశంలో న్యాయవ్యవస్థ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింప చేసేందుకు న్యాయవాదులంతా కృషి చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పేర్కొన్నారు.ఆదివారం నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ మరియు రాష్ట్ర బార్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యోం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ రమణ సతీ సమేతంగా పాల్గొన్నారు.ఈసందర్భంగా జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడుతూ ప్రజా సమస్యలు, హక్కుల పరిరక్షణలో న్యాయవాదులు మరింత కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు.అదే విధంగా న్యాయవాదులు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని ఆయన హితవు పలికారు.సమాజ శ్రేయస్సుకు న్యాయవాదుల సేవలు పూర్తిగా అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తులు సహా వివిధ ఖాళీల భర్తీకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివరాలు పంపితే వాటి భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటానని జస్టిస్ వెంకటరమణ పేర్కొన్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాక ఈప్రాంతం వాడిగా ఇక్కడకు వచ్చి ఉభయ తెలుగు రాష్ట్రాల వారిని కలవాలని అనుకున్నానని కాని కోవిడ్ పరిస్థితుల వల్ల రాలేక పోయాయని జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు.మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రతి ఒక్కరూ తనపట్ల చూపిస్తున్నఆత్మీయ,ఆదరాభిమానాలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.అనంతరం హైకోర్టు బార్ కౌన్సిల్,బార్ అసోసియేషన్ ఆద్వర్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ దంపతులను గజమాల, దుస్శాలువ,జ్ణాపికలతో ఘణంగా సత్కరించారు.అలాగే హైకోర్టు ఉద్యోగ సంఘం తరుపున వారిని ఘణంగా సత్కరించారు.అదే విధంగా వివిధ జిల్లాల బార్ అసోసియేషన్లకు చెందిన న్యాయవాదులు అధిక సంఖ్యలో రావడంతో సమయాభావం వల్ల అందరికీ అవకాశం ఇవ్వలేకపోతున్నాని అన్నారు.అంతేగాక తానేమి సెలబ్రిటీనీ కానని నేను ఈప్రాంతం వాడిని మీమనిషిని అని పేర్కొంటూ కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని హితవు పలికారు.గత రెండేళ్ళుగా మనం కరోనాతో చాలా ఇబ్బందులు పడుతున్నామని కావున కరోనా పట్ల ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తులు,న్యాయవాదులు సహా ప్రజలందరికీ జస్టిస్ వెంకటరమణ ప్రజలకు విజ్ణప్తి చేశారు.
అలాగే ఈకార్యక్రమంలో పాల్గొన్నసుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు,జస్టిస్ జెకె మహేశ్వరి,జస్టిస్ పిఎస్.నర్సింహ,రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలను రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్,రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వారిని ఘణంగా సత్కరించారు.
తొలుత వందేమాతరం,మాతెలుగుతల్లికి మల్లెపూదండ గేయాలతో ప్రారంభమైన ఈకార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ జ్యోతి ప్రజ్వలనం చేశారు. కాగా కార్యక్రమానికి తొలుత రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు స్వాగతం పలుకగా రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి మాట్లాడుతూ భారత ప్రధాన న్యాయమూర్తి ఈప్రాంతం వారు కావడం బార్ సభ్యులందరికీ స్పూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు.ఇంకా ఈకార్యక్రమంలో తెలంగాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత,రాష్ట్ర హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు,అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం,పలువురు బార్ అసోసియేషన్,బార్ కౌన్సిల్ సభ్యులు,హైకోర్టు ఉద్యోగుల సంఘం ప్రతనిధులు,రిజిష్ట్రార్లు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
addComments
Post a Comment