*"వరద ప్రాంతాల్లో కాకాణి పర్యటన
"*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకన్నపాళెం, బద్దేవోలు, పల్లెపాళెం, కట్టువపల్లి, కొలనకుదురు గ్రామాలలో పర్యటించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
భారీ వర్షాలతో, వరదలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రదేశాలను పరిశీలించి, ప్రజలను పరామర్శించి, సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం.
సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించి, శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ల స్థలాలలో నూతనంగా ఇళ్లు మంజూరు చేయించి, నిర్మిస్తాం.
సర్వేపల్లి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు, సైడు డ్రైన్లు నిర్మించడంతో ప్రజలు అవస్థల నుండి బయటపడగలిగారు.
గ్రామాలలో వరదలకు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తొలగించి, కొత్తవి ఏర్పాటు చేసి, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, విద్యుత్ ను పునరుద్ధరిస్తున్నాం.
రైతాంగానికి నారుమళ్లు దెబ్బతిన్న ప్రాంతాలలో 80 శాతం సబ్సిడీతో విత్తనాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించాం.
కండలేరు జలాశయానికి భారీగా వరదనీరు చేరడంతో కాలువల ద్వారా, వాగుల ద్వారా సముద్రంలోకి నీరు వదులుతున్నారు.
కండలేరు జలాశయం నుండి భారీగా నీరు విడుదల చేయడంతో పొలాలన్నీ జలమయమయ్యాయి.
కండలేరు జలాశయం నుండి వీలైనంత త్వరగా విడుదలవుతున్న నీటిని క్రమబద్ధీకరించి, వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చేస్తాం.
ప్రజలకు అవసరమైన భోజన సదుపాయాలు కల్పించడంతోపాటు, తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం.
నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం.
గ్రామాలలో పారిశుద్ధ్య సమస్య ఉత్పన్నం కాకుండా పంచాయతీ సిబ్బంది చొరవ తీసుకోవల్సిందిగా కోరాం.
భారీ వర్షాలతో వరదలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు ఊరట కలిగించేందుకు, అన్ని విధాలా చర్యలు చేపడుతున్నాం.
addComments
Post a Comment