ప్రజాజీవితంలో మైలురాయి 'కొణిజేటి రోశయ్య' జీవితంప్రజాజీవితంలో మైలురాయి 'కొణిజేటి రోశయ్య' జీవితం


- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సంతాపం


గుంటూరు (ప్రజా అమరావతి):

ప్రజాజీవితంలో ఒక మైలు రాయి కీర్తిశేషులు కొణిజేటి రోశయ్య జీవితమని రాష్ట్ర మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. 

యువజన సర్వీసుల శాఖ (స్టెప్), స్వశక్తి ఆధ్వర్యంలో శనివారం విజ్ఞాన్ నిరులా కళాశాల లో నిర్వహించిన 'దిశ' యాప్ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాసిరెడ్డి పద్మ ప్రసంగానికి ముందు రెండు నిమిషాలు మౌనం పాటించి కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతికి సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో హుందాతనం కలిగిన వ్యక్తిగా..ఆర్థిక పరంగా ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టిన నాయకునిగా రోశయ్య నిలిచిపోయారని గుర్తుచేసుకున్నారు. గడిచిన చరిత్రను యువత తెలుసుకుని ముందుకు సాగాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు.