కొవ్వూరు (ప్రజా అమరావతి);
సమన్వయం -- దృఢ సంకల్పం ఉంటే లక్ష్యాలను సాదించగలం - జేసి హౌసింగ్
జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం క్రింద, ప్రభుత్వం నిర్దేశించిన అతి తక్కువ రుసుము చెల్లించడం ద్వారా ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని, వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం జరుగుతుందని అనే వాస్తవాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని జాయింట్ కలెక్టర్( గృహ నిర్మాణం) సూరజ్ గానోరె పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక మునిసిపల్ కార్యాలయ కౌన్సిల్ సమావేశ మందిరంలో కొవ్వూరు పురపాలక సంఘం కు చెందిన జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం పై సమీక్ష సూరజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి సురజ్ గానోరే మాట్లాడుతూ, ఎటువంటి రిజిష్ట్రేషన్ ఛార్జీలను చెల్లించనక్కరలేకుండానే, తమ గ్రామ, వార్డు సచివాలయంలోనే రిజిష్ట్రేషన్ చేయించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశమన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు .. ఒన్ టైం సెటిల్ మెంట్ పథకం నూరు శాతం విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని స్పష్టం చేశారు. వివిధ గృహనిర్మాణ పథకాల ద్వారా రుణాలు తీసుకొని, ఇళ్లు నిర్మించుకున్నవారికి, ఒన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా ఆయా ఇళ్లు, స్థలాలను తమ పేరుమీద రిజిష్టర్ చేసుకొనే గొప్ప అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తుందన్నారు. తద్వారా లబ్దిదారుడు కి దానిపై సంపూర్ణ హక్కులు కలుగుతాయని తెలిపారు. ఈ ఒన్ టైమ్ సెటిల్మెంట్ పథకం క్రింద కనీస రుసుము చెల్లించి ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని, వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం జరుగుతుందని అన్నారు. ఒన్ టైమ్ సెటిల్మెంట్ ఎక్కువ పెండింగ్ ఉన్న సెక్రటేరియట్ లు ఈరోజు మిగిలిన డేటా వర్కు పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.
పంచాయతీ సెక్రెటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను డేటా ఎంట్రీ పై దృష్టి సారించేలా చేసి డేటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేసేలా మునిసిపల్ కమీషనర్ దృష్టి సారించాలన్నారు. ఒన్ టైమ్ సెటిల్మెంట్ పథకం నిర్ణీత కాల వ్యవధిలో అమలు చేయాలన్నారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను సచివాలయ ల్లోనే డిసెంబరు 8 వ తేదీ నుండి చేపట్టడం జరుగుతున్న విషయాన్ని ప్రజలకు విరించాలన్నారు. వన్ టైమ్ సెటిల్మెంట్ కోసం సమయం చాలా తక్కువగా ఉన్నదని లబ్ధిదారులు ఈ పథకాన్ని ఉపయోగించుకునేలా సిబ్బంది లక్ష్యాలను నిర్దేశించుకుని, క్షేత్రస్థాయిలో నూరుశాతం పూర్తి చేయాలన్నారు. రిజిష్ట్రేషన్ అనంతరం తమ ఇంటిపై లేదా స్థలంపై సర్వ హక్కులు లబ్దిదారుడు పొందగలుగుతారనే విషయం తెలియచెయ్యాల్సి ఉందన్నారు.1307 మంది లబ్దిదారుల్లో ఇప్పటి వరకు 570 అర్హులు గా గుర్తించడం జరిగిన దృష్ట్యా వెంటనే డేటా ఎంట్రీ పూర్తి చేయలన్నారు. అందుబాటులో లేనివారు, అంగీకారాన్ని తెలపని వారు, థర్డ్ పార్టీ, ఒకే సైట్ లో ఇద్దరు వ్యక్తులు, కోర్ట్ కేసులు, తదితర అంశాలపై కేటగిరీ వారీగా వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రాసెస్ లో ఉన్న వారి నుంచి ఓ టి ఎస్ మొత్తాన్ని సంబంధించిన ఖాతాకు 24 గంటల్లో జమ చెయ్యలన్నారు.
ఈ పధకం ప్రయోజనాలను లబ్ధిదారులకు తెలియజేసి ఈ పథకాన్ని వారు సద్వినియోగం చేసుకునేలా సిబ్బంది ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం అమలు కు ఐదు అంశాలను గుర్తెరిగి లక్ష్యాలను సాదించాల్సి ఉందన్నారు. హౌసింగ్ అధికారులు ఇచ్చే డేటాను అనుసరించి వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ వరకు చేపట్టవలసిన విధులను నిబ్బద్దత తో నిర్వర్తించాల్సి ఉందన్నారు. లబ్ధిదారులలో అవగాహన కల్పించి, ప్రయోజనాల గురించి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు క్షేత్రస్థాయిలో తరచుగా ఇంటింటికి వెళ్లాల్సి ఉంటుందని తద్వారా వారిలో చైతన్యం తీసుకుని రావాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఆర్డీవో ఎస్.మల్లిబాబు, తహసిల్దార్ బి.నాగరాజు నాయక్, హౌసింగ్ డి ఈ సి హెచ్ బాబురావు, వార్డు సచివాలయ సిబ్బంది, విఆర్వో లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment