పొదుపు మహిళల అభయ హస్తం - జగనార్పణం

 


*పొదుపు మహిళల అభయ హస్తం - జగనార్పణం


*


*2118 కోట్ల అభయహస్తం నిధులు స్వాహా*


*తుగ్లక్ రెడ్డి చర్యలతో డ్వాక్రా మహిళల భవిష్యత్ అంధకారం*


 - టిడిపి రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య

మంగళగిరి (ప్రజా అమరావతి);

34 లక్షల మందికిపైగా పొదుపు మహిళలతో అభయహస్తం ప్రారంభమైంది, నాటి నుంచి ఎల్ఐసి ప్రీమియం చెల్లిస్తున్నారు. ఎల్ ఐ సి సంస్థ 500 రూపాయల నుండి 2200 రూపాయలు వరకు పెన్షన్ ఇస్తుంది


అభయ హస్తం ఎకౌంట్ లో పొదుపు మహిళలు పొదుపు నిధులు 2118 కోట్ల రూపాయలు ఎల్ఐసి నుండి డబ్బులు లాగేసుకుని ప్రభుత్వం వాడుకునే ప్రయత్నం చేస్తోంది


అలాగే ఇప్పుటిదాకా ద్వాక్రా మూలనిధి కింద జాతీయ బ్యాంకుల్లో ఉన్న ఆ మొత్తాన్ని సహకార బ్యాంకులకు మళ్లించి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు


మహిళల పొదుపు నిధులకు ప్రమాదం తెచ్చిపెట్టారు


 చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు 21 వేల కోట్లు డ్వాక్రా రుణమాఫీ, పసుపు కుంకుమ ద్వారా అందించింది


రాష్ట్రంలో జగన్ రెడ్డి పరిపాలన గాడి తప్పింది,మహిళలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని వేధించే విధంగా తయారయిందిఈ ప్రభుత్వం డ్వాక్రా పొదుపు డబ్బును డ్రా చేయాలి అనే ఆలోచనను విరమించుకోవాలి


34 లక్షల పొదుపు మహిళల ప్రయోజనానికి, 5 లక్షల మంది ఆసరా పథకం లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది


ఈ స్కీం నుండి డ్వాక్రా మహిళలు 130 కోట్ల రూపాయలు ప్రీమియం చెల్లిస్తూ పలు ప్రయోజనాలు పొందుతున్నారు అయితే ఈ పథకాలు అమలు చేసే బాధ్యత నుంచి స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయటం దుర్మార్గం


జగన్ రెడ్డి చర్యలవల్ల డ్వాక్రా  సంఘాల ఉనికి ప్రమాదంలో పడింది, డ్వాక్రా సంఘాల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది 


మహిళా సంక్షేమం, మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పే వైసీపీ ప్రభుత్వం...ఆచరణలో మాత్రం మహిళల పొదుపు సొమ్ము లాక్కునే దుస్థితిలో ఉండటం వారి అసమర్ధతకు నిదర్శనందారి మళ్లించిన డబ్బులు మొత్తం తక్షణమే జమచేసి పథకాన్ని కొనసాగించాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.